రోజు కాఫీ త్రాగటం వల్ల అంత ప్రమాదమా.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..?!

కాఫీలో ఉండే కెఫెన్ శరీరానికి చాలా ప్రమాదం అని ఎప్పటినుండో నిపుణులు చెప్తున్నారు. మరోవైపు కాఫీ రోజు తాగడం వల్ల క్యాన్సర్, గుండె సమస్యలకు దూరంగా ఉండవచ్చు అని అంటున్నారు. అయితే చాలామందికి కాఫీ లేనిదే రోజు గ‌డవదు. అలాంటిది కాఫీలో కెఫెన్ చాలా ప్రమాదకరం అని తెలుస్తుంది. అయితే కెఫెన్ మంచిదే కానీ.. ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. కెఫెన్‌ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. రోజుకు ఒక గ్రాము కంటే ఎక్కువ కేఫెన్‌ తీసుకోవడం వల్ల మెదడు దెబ్బతింటుందని.. తరచు ఆందోళనకు గురవడం, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు.

Caffeine: Benefits, risks, and effects

అయితే తాజాగా ఓ పరిశోధనలో ఫర్కిన్సాన్స్ వ్యాధి బారిన పడిన వారిలో ఎనిమిది శాతం మంది కేఫెన్ వల్లే ఆ వ్యాధికి గురైనట్లు వెళ్లడైంది. కేఫెన్ ఎక్కువగా తీసుకుంటే చేతులు వెణ‌కడం లాంటి లక్షణాలు కనిపిస్తాయట. కేఫెన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువ మూత్రం వెళ్లే అవకాశం ఉందని.. డిహైడ్రేట్ అయ్యి తలనొప్పులకు దారితీస్తుందని అంటున్నారు. అయితే కాఫీ తాగితే తలనొప్పి సమస్య తగ్గే అవకాశం ఉందని మరో పక్క పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రలేమి సమస్య కూడా కెఫెన్ కారణమని సమాచారం. అయితే ఈ సమస్య యువకుల్లో కంటే వయసు పైబడిన వాళ్లలో ఎక్కువగా కనిపిస్తుందని ఇప్పటివరకు గుర్తించారు.

కేఫెన్ ఎక్కువగా తీసుకున్న వారు నిద్రపోయే సమయం తక్కువగా ఉంటుందట. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని.. రోజు రెండు నుంచి మూడు, నాలుగు కప్పులు కాఫీ తాగే వారిలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుందని వెళ్లడైంది. 10 కాఫీ కప్పులు తాగితే ఒక గ్రాము కాఫీ తీసుకున్నట్టు. అలాగే ఒకటి పాయింట్ రెండు గ్రాములు కంటే ఎక్కువ కెఫైనా తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. కనుక కాఫీ రోజు తాగడం మంచిదే. కానీ మితంగా తాగడం వల్లనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రోజుకు ఐదు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే ఎంతో ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

Caffeine and depression: Positive and negative effects

అయితే కాఫీని పూర్తిగా మానేయడం కూడా మంచిది కాదట. రోజుకు కొంత కెఫెన్‌ తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని మెదడు చురుగ్గా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. అయితే ఎక్కువగా తీసుకుంటే నిద్రలేమి, ఫర్కిన్సాన్స్, రక్తపోటు లాంటి సమస్యలు తలెత్తుతాయని వివరించారు. శరీరంలో కెఫెన్ రక్తంలో చేరడానికి 15 నిమిషాల నుంచి రెండు గంటల సమయం పడుతుంది. దీంతో కెఫెన్ తాగి దాని నుంచి వెంటనే ఉపశమనం పొందాలని అంతా భావిస్తారు. అయితే పరగడుపున కాఫీ తాగితే వచ్చే శక్తి మరే సమయాల్లో తాగిన రాదని నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడంతో.. లివర్ క్యాన్సర్, డిప్రెషన్, టైప్ 2 డయాబెటిస్ రాకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు. కానీ మితంగా తాగకుంటే ప్రతికూల ప్రభావాలు కూడా అంతే ఉన్నాయని గుర్తుంచుకోండి.