ఏపీ గురించి పోనామ్ కౌర్ షాకింగ్ పోస్ట్.. కాక రేపుతున్న స్టార్ బ్యూటీ హాట్ కామెంట్స్..!!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూన‌మ్‌ కౌర్ కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ సంపాదించుకుంది ఈ అమ్మడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన పూన‌మ్‌.. ప్రస్తుతం పూర్తిగా సినిమాలకు దూరమైంది. అయితే తాజాగా ఈ అమ్మడు రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. రాజకీయ నేతలపై.. హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలపై నెట్టింట షాకింగ్ పోస్టులు చేస్తూ చర్చినీయాంశంగా మారుతుంది.

Poonam Kaur Family Husband Biography Parents children's Marriage Photos

ఈ నేపథ్యంలో తాజాగా ఈమె చేసిన పోస్ట్ ప్ర‌స్తుతం హ‌ట్‌ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. అన్ని పార్టీలు తమ పార్టీని గెలిపించుకునేందుకు ఎంతో శ్రమిస్తున్నాయి. ఎలక్షన్ సమయం దగ్గర పడడంతో ప్రచారాల జోరు పెంచి.. తమ పార్టీని గెలిపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక మే 13వ తేదీన పోలింగ్ మొదలుకానుంది. జేన్ 4న ఓట్ల లెక్కింపు ప్ర‌రంభం అవుతుంది. ఈ నేపథ్యంలో నటి పూనమ్‌ కౌర్ ఏపీని ఉద్దేశిస్తూ చేసిన పోస్ట్ నెట్టింట సెన్సేషన్ గా మారింది.

Poonam kaur | 🫶 Nothing is so strong as gentleness, nothing so gentle as  real strength. Saint Francis de Sales | Instagram

ఈ మేరకు ఏపీ ఇస్ ద న్యూ యూపీ అంటూ తన ఎక్స్ ఖాతా ద్వారా పోస్ట్ ను షేర్ చేసుకుంది పైన‌మ్‌. ఏపీని.. ఉత్తరప్రదేశ్ తో పోలుస్తూ పూనమ్ కౌర్ పెట్టిన పోస్ట్ నెటింట‌ తెగ వైరల్ అవుతుంది. ఈ టైంలో ఇలాంటి పోస్ట్ ఎందుకు పెట్టిందంటూ అంతా తెగ ఆలోచిస్తున్నారు.. అయితే ఎప్పుడు జనసేనని అభ్యర్థి పవన్ కళ్యాణ్, డైరెక్ట‌ర్‌ త్రివిక్రములపై ఇన్ డైరెక్ట్ గా షాకింగ్ కామెంట్స్ చేసే ఈ అమ్మడు.. ఏ ఉద్దేశంతో ఇప్పుడు ఈ పోస్ట్ షేర్ చేసిందో అంటూ ఆలోచనలో పడ్డారు.