ఆ పనికి నో చెప్పడం వల్లే నాకు సినిమా ఛాన్స్ లు తగ్గాయి.. మృణాల్ ఠాగూర్ షాకింగ్ కామెంట్స్..

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా దూసుకుపోతూనే మృణాల్‌ ఠాగూర్.. యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది. సీతారామంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్.. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ చిన్నది.. తర్వాత నాని హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది.

Mrunal Thakur says she 'kept missing on films' as her parents disapproved  of kissing scenes: 'I'd just get scared' | Bollywood News - The Indian  Express

క్లాసికల్ మూవీస్ తో ఆకట్టుకుంటున్న మృణాల్‌.. ఫ్యామిలీ ఆడియన్స్ లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. అయితే ఇప్పుడు వరుస ఆఫర్లను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఒకానొక టైంలో వాళ్ల పేరెంట్స్ కారణంగా అవకాశాలు తగ్గాయంటూ వివరించింది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్‌ మాట్లాడుతూ దీనికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది. మా పేరెంట్స్ కు ముద్దు సీన్స్‌, రొమాంటిక్ సీన్స్ ఉన్న సినిమాలు తీయడం నచ్చదు. దీంతో అలాంటి సన్నివేశాలు ఉన్న ఎన్నో సినిమాలకు నేను నో చెప్పేసా.

Mrunal Thakur: ಅನಾರ್ಕಲಿ ಔಟ್‌ಫಿಟ್‌ನಲ್ಲಿ ಅಂದ ಹೆಚ್ಚಿಸಿಕೊಂಡ ಮೃಣಾಲ್‌ ಠಾಕೂರ್;‌  ಕಣ್ಣು ಕುಕ್ಕುವ ಈ ಡ್ರೆಸ್‌ ಬೆಲೆಯೂ ಅಷ್ಟೇ ತುಟ್ಟಿ!-tollywood news actress mrunal  thakur shines in pink ...

ఎందుకంటే అలాంటి ముద్దు సీన్లలో నన్ను చూస్తే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో అని భయం వేసింది. కానీ ఎంత కాలం అని భయపడాలి.. దీంతో పేరెంట్స్ తో మాట్లాడే టైం వచ్చింది. ముద్దు సీన్లు కూడా నా వృత్తిలో భాగమే.. అని వాళ్ళ‌తో చెప్పేసా. మీకు అసౌకర్యంగా ఉంటుందని నేను చాలా ఆఫర్లు మిస్ చేసుకున్నాను.. కానీ అది నా సెలెక్షన్ కాదు.. పాత్రలో ప్రాధాన్యత ఉన్నప్పుడు చేయాలి. దానికి మీరు అంగీకరించాలని మా పేరెంట్స్ కు చెప్పేసానంటూ వివరించింది మృణాల్‌ ఠాగూర్. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.