రోజు ఈ జ్యూస్ తాగితే.. ఈ సమస్యలన్నీ ఫటా ఫట్ మాయం..!

సెలరీ జ్యూస్.. ఇందులో ఫైబర్, విటమిన్స్, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. దీన్ని రోజు తాగితే..ఉపయోగాలు పొందవచ్చు. సెలరీలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి..ఈ జ్యూస్ తాగితే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. సెలరీ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇనే ఫ్లమేటరి కొంపాండ్స్ ఉంటాయి.

ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ ను తగ్గించుకోవడంలో సహాయపడతాయి. సెలరీ జ్యూస్ లో ఫైబర్స్ పోలీఫైనాల్స్ ఉంటాయి. ఇవి జీర్ణ క్రియను, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ఇది మలబద్ధకానికి జాషధంలా పని చేస్తుంది. సెలరీ జ్యూస్..శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. చెత్త, వ్యర్థాలను బయటకు పంపడానికి తోడ్పడుతుంది. లివర్, కిడ్నీల పనితీరుకు సహాయపడుతుంది.

సెలరిలో క్లాలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపున నిండుగా ఉంచి, అతిగా తినకుండా చేస్తుంది. దీంతో..బరువు తగ్గుతారు. సెలరీ జ్యూస్ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు చర్మం కణాలను ఫ్రి రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఈ జ్యూస్ తాగితే..చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. సెలెరీలో అపిజెనిన్, లుటిమోలిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. వీటికి క్యాన్సర్ కణాలతో పోరాడే లక్షణాలు ఉన్నాయని అధ్యయనాలు పేర్కొన్నాయి.