వేసవికాలంలో ఫేస్ ని కాంతివంతంగా మార్చే ఫేస్ ప్యాక్స్ ఇవే..!

వేసవిలో ఈ ఫేస్ ప్యాక్స్ తో చర్మం కాంతివంతంగా మారాలంటే ఈ చిట్కాను ఫాలో అవ్వండి. వేసవిలో ఎండ ప్రభావం వల్ల చర్మం నల్లగా మారుతుంది. అలాగే వేడితో పొడిబారిపోయి ముడతలు ఏర్పడుతాయి. వీటిని నివారించేందుకు వేసవిలో కొన్ని నేచురల్ ఫేస్ ప్యాక్స్ ఉపయోగించడం మంచిది. అవేంటో చూద్దాం. కీరదోస గుజ్జులో కొద్దిగా అలోవెరా జెల్ కలిపి విశ్రమం లా తయారు చేయాలి.

దీనిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత క్లీన్ చేసుకుంటే నిమిషంలో చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మం సౌందర్యం కోసం ముల్తాని మట్టి ఫేస్ ప్యాక్ వాడటం చాలా మంచిది. దీనికోసం ముల్తాని మట్టిలో కొద్దిగా రోజు వాటర్ కలిపి మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాలు ఉంచుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. టమాటో గుజ్జులో పెరుగు కలిపి మిశ్రమం లా తయారు చేయాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు ఉంచుకొని క్లీన్ చేసుకుంటే మంచిది.

ఇది ఎండ వల్ల ఏర్పడిన ట్యాన్ ను తొలగిస్తుంది. నారింజ తోక్క పొడిలో కొద్దిగా చందనం, తగినంత రోజ్ వాటర్ కలిపి విశ్రమం లా చేసుకోవాలి. దీనిని ముఖానికి మెడకు రాసి 15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత క్లీన్ చేసుకుంటే ముఖానికి సహజమైన కాంతి లభిస్తుంది. బొప్పాయి పండును గుజ్జుల చేసి దానికి ఒక స్పూన్ తేనె కలపాలి. దీనికి ముఖానికి, మెడకు అప్లై చేసి 15 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత క్లీన్ చేసుకుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.