విశ్వ‌క్‌సేన్ – నేహాశెట్టి రొమాంటిక్ మూమెంట్ చూస్తారా.. ( వీడియో )

మూవి ప్రమోషన్స్ విషయంలో టాలీవుడ్ కూడా బాలీవుడ్ బాట పడుతున్నట్లు అర్థమవుతుంది. తాజాగా ఖుషి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మ్యూజికల్ కాన్సెప్ట్‌ను ఏర్పాటు చేశారు మూవీ టీం. ఇందులో విజయ్ దేవరకొండ – సమంత వేదికపై డాన్స్ చేయడం ఈ ఇవెంట్ కు మరింత హైలెట్గా నిలిచింది. లీడ్ పెయిర్ ఈ తరహా డాన్స్ పర్ఫామెన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా కొత్తగా అనిపించింది.

ఇదే బాటలో విశ్వక్సేన్ మరియు నటి నేహా శెట్టి న‌టించిన మూవి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమాలో అంజలి, సాయికుమార్, నాజర్, గోపరాజు రామన్న తదితరులు కీరోల్స్ లో నటించారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా సాంగ్ ఓపెనింగ్ ఈవెంట్ లో భాగంగా స్టేజ్ పై రొమాంటిక్ పర్ఫామెన్స్ చేశారు.. విశ్వక్సేన్ – నేహా శెట్టి.

యువన్ శంకర్ రాజా రాసిన సూటమ్‌లా చూసి అనే మెలోడీ సాంగ్ కి డాన్స్ రొమాంటిక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. ప్రస్తుతం ఆ ప‌ర్ఫామెన్స్‌ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో అప్డేట్ అయిన కొద్దిసేపటికే బాగా వైరల్ అయింది.