ఆఫ‌ర్ల కోసం దానికి కూడా ఒప్పేసుకుంటున్న కృతి శెట్టి.. ద‌రిద్రం అంటే ఇదే!

ఉప్పెనతో టాలీవుడ్ లోకి దూసుకొచ్చిన అందాల సోయగం కృతి శెట్టి.. ఫస్ట్ మూవీ తోనే ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉప్పెనతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ విజయాలను ఖాతాలో వేసుకుంది. దీంతో కృతి శెట్టికి టాలీవుడ్ లో తిరుగు లేదని అందరూ భావించారు. కానీ అంతలోనే ఆమెకు షాకుల మీద షాకులు తగిలాయి.

కృతి శెట్టి నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. ఈ ఏడాది క‌స్ట‌డీ మూవీతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో గోల్డెన్ లెగ్‌ అన్న వారే ఇప్పుడు ఆమెను ఐరన్ లెగ్ అంటూ దారుణంగా టోల్ చేస్తున్నారు. టాలీవుడ్ కి ఆఫర్లు భారీగా తగ్గిపోయాయి. ఇంకా చెప్పాలింటే ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.

క‌న్న‌డ, మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇస్తూ ఆయా భాష‌ల్లో ఒక్కో సినిమా చేస్తోంది. అయితే టాలీవుడ్ లో ఆఫర్లు లేకపోవడంతో కృతి శెట్టి షాకింగ్ నిర్ణయం తీసుకుందట. త‌న రెమ్యున‌రేష‌న్ ను బాగా తగ్గించుకుందట. ఇంతకుముందు ఒక సినిమాకు కోటిన్నర తీసుకున్న కృతి శెట్టి.. ఇప్పుడు రూ. 80 లక్షల ఇచ్చినా సినిమాకు ఒప్పుకునేందుకు సిద్ధపడిందట. పెద్ద‌గా స్టార్డ‌మ్ లేని కుర్ర హీరోల‌తో అయినా న‌టిస్తాన‌ని చెబుతుంద‌ని నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ తో సినిమాలు చెయ్యాల్సిన కృతి శెట్టికి ఇలాంటి ప‌రిస్థితి రావ‌డం నిజంగా ద‌రిద్రం అనే చెప్పాలి.