కోపంగా క‌నిపించే బాల‌య్య త‌న పిల్ల‌లు త‌ప్పు చేస్తే ఏం చేస్తాడో.. తెలుసా…!

నందమూరి నట‌సింహం బాలయ్య టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటీవల రిలీజైన వీర సింహారెడ్డి సినిమాతో రూ.100 కోట్ల భారీ కలెక్షన్లను వసూలు చేసి యంగ్ హీరోల సినిమాలకు కాంపిటీషన్ గా రికార్డులను సృష్టించిన బాలయ్య.. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్ కేసరి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా త‌ర్వాత వ‌రుస‌గా 3 సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడ‌ట బాట‌య్య‌.

ఒక‌టి టాలీవుడ్ యంగ్‌ డైరెక్టర్ బాబి తో , మరొకటి గోపీచంద్ మల్లినేనీతో తెరకెక్కుతుంది. ఆ తర్వాత బోయపాటి బాలయ్య కాంబినేషన్లో అఖండ 2 సినిమా రూపొందించబోతున్నట్లు సమాచారం. ఇలా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న బాలయ్య పర్సనల్ లైఫ్ కి సంబంధించిన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చాలామందికి తెలిసిన విషయమే బాలయ్యకి ముక్కు మీద కోపం ఉంటుంది. ఉన్న‌ది ఉన్నట్లు మాట్లాడే బాల‌య్య‌ తప్పు చేసిన వరు సారి చెప్పే వరకు వదలడు. అలాంటి బాలయ్య కుటుంబం ని ఎలా ట్రీట్ చేస్తాడు తన పిల్లలు తప్పు చేస్తే ఎటువంటి పనిష్మెంట్ ఇస్తాడు అని ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది.

తన కుటుంబ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య ఇంట్లో కూడా అంతే కోపంగా స్ట్రిక్ట్ గా ఉంటాడట‌. పిల్లల విషయంలో కూడా అదే విధంగా బిహేవ్ చేస్తారని తెలుస్తుంది. బ్రాహ్మణి, తేజస్విని, మోక్షజ్ఞ వీరిలో ఎవరు తప్పు చేసినా సరే ఒకటి, రెండు సార్లు నిదానంగా కూల్ వే లో అర్థమయ్యేలా చెప్తాడట. మూడోసారి మాత్రం అదే తప్పు చేస్తే తాట‌తీస్తాడ‌ని తెలుస్తుంది. కానీ అంతవరకు ఈ ముగ్గురు ఇప్పటివరకు తెచ్చుకోలేదని కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం వార్త‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.