వార్ని.. స్టేజీ పై విజయ్ ని షర్ట్ విప్పమని చెప్పింది ఆయనా..? ఇదేం ట్విస్ట్ రా బాబు..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే రౌడీ హీరో విజయ్ దేవరకొండ .. హీరోయిన్ సమంత పేర్లు మారుమ్రోగిపోతున్నాయి . దానికి రీజన్ వాళ్లిద్దరూ కలిసి నటించిన ఖుషి సినిమా ఈవెంట్లో స్టేజ్ పై హాట్ పర్ ఫామెన్స్ తో పాటు రొమాన్స్ చేయడమే అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఒక హిట్ కొట్టాలని ఎంతో ఈగర్ గా ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. విడాకుల తర్వాత ఒక్కటంటే ఒక్కటి హిట్ అందుకోని సమంత హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి తెగ ట్రై చేస్తుంది.

ఇలాంటి క్రమంలోనే యూత్ ఫుల్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఖుషి సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నారు ఈ ఇద్దరు . ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గానే రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. రీసెంట్గా ఈ సినిమా ఈవెంట్లో స్టేజ్ పై విజయ్ దేవరకొండ షర్ట్ విప్పేసి మరి సమంతను ఎత్తేసుకొని గిరగిరా తిపేస్తూ ఎంత హంగామా చేసాడో మనం చూసాం .

అయితే ఎప్పుడు లిమిట్స్ లో ఉండే విజయ్ దేవరకొండ ఎందుకు స్టేజిపై షర్ట్ విప్పేసి మరి సమంతతో ఆ రేంజ్ లో పర్ఫామెన్స్ పేరుతో రొమాన్స్ చేసాడు అన్నది రౌడీ హీరో ఫ్యాన్స్ కూడా అర్థం కాలేదు. ఈ క్రమంలోనే అసలు స్టేజిపై విజయ్ షర్ట్ విప్పడానికి కారణం డైరెక్టర్ శివనిర్వాణ అంటూ ప్రచారం జరుగుతుంది. ఆయన చెప్పిన కారణంగానే విజయ్ దేవరకొండ షర్ట్ విప్పేసి సమంతని అలా పైకి ఎత్తుకొని తిప్పాడని లేకపోతే విజయ్ దేవరకొండకు ఆ ఇంటెన్షన్ లేదని చెప్పుకొస్తున్నారు జనాలు. అంతేకాదు సినిమా హిట్ అవ్వడానికే శివ నిర్వాణ ఇలాంటి స్ట్రాటజి ఉపయోగించారు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . సినిమా రిజల్ట్ ఏమో కానీ వీళ్ళ పెర్ఫార్మెన్స్ మాత్రం హైలెట్ అయిపోయింది..!!