రాంగ్ రూట్ లో వెళ్తున్న కీర్తి సురేష్.. తెలిసి తెలిసి ఇంత పెద్ద తప్పు చేస్తుంది ఏంటి..!

పాపం తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ కీర్తి సురేష్ తెలిసి తెలియక తనంతో చేస్తున్న పనులు ..తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు ఆమెను ముంచేసేస్తున్నాయి . సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్.. ఇప్పటివరకు హిట్స్ కొట్టింది చాలా తక్కువ. కానీ మహానటి సినిమా ద్వారానే ఆమె పాపులారిటీ సంపాదించుకొని ఆ హిట్ తో వచ్చిన సక్సెస్ కారణంగానే ఇప్పటికీ ఆఫర్లు అందుకుంటుంది .

టాలీవుడ్ బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ రీసెంట్గా భోళా శంకర్ సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కా బాప్ అనే రేంజ్ లో పరమ చెత్త కలెక్షన్ సాధించింది . సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది . అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం కీర్తి సురేష్ అంటూ పలువురు మండిపడ్డారు. ఆమె సిస్టర్ గా నటిస్తే చాలు ఆ సినిమా సంక నాకి పోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు .

అయితే ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా రిజల్ట్ చూసి కూడా కీర్తి సురేష్ మరో సిస్టర్ సెంటిమెంట్ సినిమాను ఓకే చేసింది అంటూ ప్రచారం జరుగుతుంది. కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్ సినిమాలో ఆమె సిస్టర్ రోల్ లో కనిపించబోతుందట . స్టార్ హీరో అజిత్ కు ఆమె సిస్టర్ గా కనిపించబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . అంతేకాదు అజిత్ సరసన హీరోయిన్ గా నయనతార ఈ సినిమాలో నటిస్తుంది అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే నయనతార లాంటి క్రేజీ హీరోయిన్ ఉండగా కీర్తి సురేష్ ని ఎవరు చూస్తారు..? తెలిసి తెలిసి కీర్తి ఎందుకు ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటుంది ..? అంటూ మండిపడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో కీర్తి సురేష్ డెసిషన్ వైరల్ గా మారింది..!!