సాయి ప‌ల్ల‌వికి మైండ్ దొబ్బిందా.. అంత తింగ‌రి ప‌ని ఎలా చేసింది?

న్యాచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి కెరీర్ విష‌యంలో మునుప‌టి జోరును ఏ మాత్రం చూపించ‌డం లేదు. గ‌త ఏడాది ముందు వ‌ర‌కు బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో అల‌రించిన సాయి ప‌ల్ల‌వి.. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ కు ఒప్పుకోవ‌డం లేదు. తాజాగా మ‌రో క్రేజీ చిత్రాన్ని వ‌దులేసుకుని ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సార్ వంటి సూప‌ర్ హిట్ అనంత‌రం కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ తెలుగులో నేరుగా మ‌రో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

శేఖ‌ర్ క‌మ్ముల ఈ మూవీకి ద‌ర్శ‌కుడు. ధ‌నుష్ కెరీర్ లో 51వ చిత్ర‌మిది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణ దాస్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా ఎంపిక అయింది. అయితే నిజానికి మొద‌ట శేఖ‌ర్ క‌మ్ముల సాయి ప‌ల్ల‌విని హీరోయిన్ గా తీసుకోవాల‌ని భావించారు. అల్రెడీ ఆమెకు శేఖ‌ర్ క‌మ్ముల ఫిదా, ల‌వ్ స్టోరీ వంటి హిట్స్ ఇచ్చాడు. పైగా గ‌తంలో ధ‌నుష్, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన మారి 2 మంచి విజయం సాధించింది. అందుకే `D51` కోసం సాయి ప‌ల్ల‌విని శేఖ‌ర్ క‌మ్ముల సంప్ర‌దించాడ‌ట‌.

కానీ, ఆమె మాత్రం నో చెప్పేసింద‌ట‌. దాంతో చేసేదేమి లేక ర‌ష్మిక‌ను హీరోయిన్ గా తీసుకున్నార‌ని టాక్ న‌డుస్తోంది. నిజానికి శేఖ‌ర్ క‌మ్ముల మంచి స‌క్సెస్ రేటు ఉన్న ద‌ర్శ‌కుడు. పైగా ఆయ‌న సినిమాల్లో హీరోయిన్ల‌కు చ‌క్క‌ని ప్రాధాన్య‌త ఉంటుంది. మ‌రియు హీరోయిన్ల‌ను చాలా ప‌ద్ధ‌తిగా చూపిస్తాడు. ఇవ‌న్నీ సాయి ప‌ల్ల‌వికి బాగా తెలుసు. అలాంటి పాత్ర‌ల‌నే ఆమె కూడా ఇష్ట‌ప‌డుతుంది. అయినాస‌రే శేఖ‌ర్ క‌మ్ముల‌-ధ‌నుష్ మూవీని రిజెక్ట్ చేసింది. దీంతో సాయి ప‌ల్ల‌వికి మైండ్ దొబ్బిందా.. అంత తింగ‌రి ప‌ని ఎలా చేసింది.. చేతులారా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను వ‌దిలేసిందా అంటూ ఫ్యాన్స్‌, సినీ ల‌వ‌ర్స్ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. మరికొంద‌రు సాయి ప‌ల్ల‌వికి ఒక సినిమాలు చేసే ఉద్దేశం లేదేమో అంటూ అభిప్రాయ‌ప‌డుతున్నారు.