బంగారం ల‌వ‌ర్స్‌కు గుడ్‌న్యూస్‌… శ్రావ‌ణ‌మాసం ఎఫెక్ట్‌తో త‌గ్గిన రేట్లు..!

శ్రావణమాసం వచ్చిందంటే చాలు చాలామంది మహిళలు బంగారం కొంటూ ఉంటారు. శ్రావణమాసంలో బంగారం కొంటే ఏడాదంతా మనకి కలిసి వస్తుందని నమ్మకంతో వారు బంగారు కొనుగోళ్లపై ఆసక్తి చూపుతూ ఉంటారు.ఇక ప్రస్తుతం శ్రావణమాసం ఎఫెక్ట్‌తో నేడు బంగారు ధరలు మరోసారి స్వల్పంగా తగ్గంది. శ్రావణమాసం మొదలై బంగారం కొనుగోలు చేయాలని చూసే చాలామందికి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు 10 గ్రాములకు 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,550 ఉండగా నేడు రూ.100 తగ్గడం రూ54,450 గా ఉంది. అలాగే 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ బంగారం ధర నిన్న రూ.59,510 ఉండగా ఈరోజు 110 రూపాయలు తగ్గి రూ59, 400 లోకి చేరింది. దీంతో ఈరోజు బంగారం కొనాలి అనుకున్న వారికి ఈ ఆఫర్ పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి.