కంచుకోటలో టీడీపీ వెనుకడుగు..వైసీపీకి చిక్కినట్లేనా?

అది టి‌డి‌పి కంచుకోట…వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టింది..అయితే నాలుగో సారి గెలవడంపై అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే టి‌డి‌పి కంచుకోటపై వైసీపీ పట్టు సాధిస్తుంది. దీంతో టి‌డి‌పి బలం తగ్గుతుంది. ఇక టి‌డి‌పి బలం తగ్గడానికి ఉదాహరణగా తాజాగా చంద్రబాబు పర్యటనలో పెద్దగా జనం లేకపోవడం..దీంతో ఆ కంచుకోటలో టి‌డి‌పికి భారీ దెబ్బ తగిలేలా ఉంది.

అలా టి‌డి‌పి వెనుకడుగు వేసిన కంచుకోట ఏదో కాదు..ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట స్థానం. గత మూడు ఎన్నికల్లో వరుసగా ఇక్కడ టి‌డి‌పి జెండా ఎగురుతూ వస్తుంది. 2009, 2014, 2019 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి వేగుళ్ళ జోగేశ్వరరావు గెలుస్తూ వస్తున్నారు. అయితే 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక టి‌డి‌పి కంచుకోటలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి పనిచేస్తుంది. కుప్పంతో సహ టి‌డి‌పి సిట్టింగ్ సీట్లలో బలం పెంచుకునే దిశగా వస్తుంది. ఈ క్రమంలో మండపేటలో వైసీపీ బలం పుంజుకుంది. ఇక్కడ వైసీపీ ఇంచార్జ్ గా టి‌డి‌పి నుంచి వచ్చిన తోట త్రిమూర్తులు పనిచేస్తున్నారు.

ఈయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ఈయన మండపేటలో టి‌డి‌పికి చెక్ పెడుతూ పనిచేస్తున్నారు. పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ వన్‌సైడ్ గా గెలిచింది. ఆఖరికి టి‌డి‌పి కంచుకోటగా ఉన్న మండపేట మున్సిపాలిటీని సైతం వైసీపీ గెలుచుకుంది. ఇలా మండపేటపై వైసీపీకి గ్రిప్ వచ్చింది.

తాజాగా మండపేటలో బాబు పర్యటించారు. బాబు రోడ్ షోకు పెద్దగా ప్రజాదరణ దక్కలేదు. అటు సభలో జనం పెద్దగా లేరు. దీని బట్టి చూస్తే మండపేటలో టి‌డి‌పి వెనుకబడిపోయిందని తెలుస్తోంది. ఇక ఈ సారి అక్కడ వైసీపీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే టి‌డి‌పికి చిన్న ఆశ ఏంటంటే..జనసేనతో పొత్తు. ఇక్కడ జనసేనకు 30 వేల పైనే ఓటింగ్ ఉంది. అది కలిస్తే టి‌డి‌పికి మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంది. పొత్తు లేకపోతే వైసీపీ గెలుపు ఖాయమే.