సినీ ఇండస్ట్రీ బాగుపడాలంటే ఆయన ఉండకూడదు… పృధ్విరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారం జోరు పెంచారు. ఈ క్రమంలోనే మాటలు తుటల్లా పేలుతున్నాయి. వివరాల్లోకి వెళితే..ఎన్నికల సమాచారం లో సినీ నటులు కూడా పాల్గొంటున్నారు అనే విషయం తెలిసింది.

సినీ నటుడు పృధ్విరాజ్ తాజాగా అనకాపల్లిలో జనసేన అభ్యర్థి రామకృష్ణ ని గెలిపించాలని కోరుతూ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియోతో మాట్లాడారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అని నటుడు పృధ్విరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ను ఓడిస్తే గాని సినిమా ఇండస్ట్రీ బాగుపడదని కామెంట్స్ చేశారు.

సినీ ఇండస్ట్రీ బాగుకోసం చిరంజీవితో పాటు ఇతర అగ్ర నటులు సీఎం జగన్ ఇంటికి రప్పించాడన్నారు. అయితే గేటు దగ్గర నుంచి ఇంటి వరకు వారిని నడిపించి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే గాని సినిమా ఇండస్ట్రీ బాగుపడదని నటుడు పృథ్వీరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన అభ్యర్థి కోడతాల రామకృష్ణ అనే భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.