ఐదు నెలలుగా నరకం అనుభవిస్తున్న.. కంటతడి పెడుతూ తన ఆవేదనను ఫ్యాన్స్ తో పంచుకున్న గీతూ రాయల్..!

హీరోయిన్ గీతు రాయల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గీతు రాయల్ మొదట బిగ్
బాస్ రివ్యూయర్ గా యూట్యూబ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు రియాలిటి షో బిగ్ బాస్ సీజన్-6 లో కంటె స్టెంట్ గా పాల్గొని తన అందం, అభినయంతో తనదైన ఆటతీరును చూపించింది. అంతేకాకుండా బిగ్ బాస్ లో చిత్తూర్ యాసలో మాట్లాడి ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ఆమె మాటలు ఎంతోమందిని ఆకట్టుకున్నాయనడంతో అతశ శక్తి లేదు. అయితే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయి గీతూ రాయల్ బయటకు వచ్చాక ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది.

ఇక అప్పటి నుండి తన ఫ్రెండ్ ధనుష్తో కలిసి యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తూ నటింట రచ్చ చేస్తుంది. ఈ నేపథ్యంలో..తాజాగా గీతా 5 నెలల నుండి ఓ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుపుతూ హాస్పిటల్ బడ్ పై ఉన్న వీడియో షేర్ చేసింది. అంతేకాకుండా తనకు అలా కావడానికి కారణాలు కూడా చెప్పి షాకిచ్చింది. గీతు మాట్లాడుతూ…నేను బ్యాంకాక్ వెళ్లి అనేక రకాల ఆహార పదార్థాలు తిన్నాను. బొద్దింకలు, పిట్టలు వంటివి అనేక రకాలు స్పెషల్స్ తిని వచ్చాను. ఎందుకంటే..చనిపోయే లోపు అన్ని చూడాలి. ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతోనే అలా చేశాను.

అప్పటి నుంచే నాకు అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఇదే కాకుండా నేను ఓ ఇద్దరూ అమ్మ వార్ల దేవాలయ ల‌కు వెళ్లి దర్శించుకోకుండా వచ్చాను. ఇది కూడా ఒక కారణం కావోచ్చని నాకు అనుమానంగా ఉంది. నా ఫ్రెండ్స్ తో కలిసి నేను ఒక్కసారి విజయవాడకు వెళ్లాను. కానీ అమ్మవారిని దర్శించుకోకుండా వచ్చేసాను. అలాగే తిరుచానూరుకు కూడా వెళ్లి దర్శనం చేసుకోకుండానే వచ్చాను. అందుకే నాకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అనిపిస్తుంది. 5 నెలల నుండి నేను హాస్పటల్ తిరుగుతున్నాను. అయితే డాక్టర్లు కోటి మందిలో ఒకరికి వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. దీనితో పెద్ద ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవడంతో అసలు విషయం తెలిసింది. దీనికి రెండేళ్ల పాటు కంటిన్యూస్ గా ట్రిట్ మెంట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారు. అలాగే ప్రతి వారం ఇంజక్షన్ వేయించుకోవాలని అన్నారు. ఈ సమస్యతో బాగా ఆలోచించి నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది. దీనితో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ గీత తొందరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.