ఖుషి మ్యూజిక్ ఈవెంట్‌లో విజ‌య్ వేసుకున్న డ్రెస్ రేటు తెలుసా…!

ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా రూపొందిన సినిమా ఖుషి. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మ్యూజికల్ కాన్సర్ట్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ సమంత కలిసి డాన్స్ స్టెప్పులతో అదరగొట్టారు.

విజయ్ దేవరకొండ తన ష‌ర్ట్‌విప్పేసి మరి గ్లామర్ షో చేస్తూ సమంతతో చిందులు వేశాడు. ఇక విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్‌కి కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నట్లుగానే డ్రెస్సింగ్ స్టైల్‌కి కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. విజయ్ దేవరకొండ ఖుషి మ్యూజికల్ కాన్సెర్ట్‌ ఈవెంట్ లో గ్రాండ్‌లుక్ తో కనిపించాడు. ఈ హీరో ధరించిన డిఫరెంట్ స్టైల్ అవుట్ ఫిట్.. వైట్ కలర్ డ్రెస్ ఫ్యాన్స్ కే కాకుండా ట్రెండ్‌ లవర్స్‌కి కూడా బాగా నచ్చిందంటూ కామెంట్స్ వచ్చాయి.

 

దీంతో ఈ అవుట్ ఫిట్ ధర ఎంత ఉంటుంది అనే దానిపై ఆన్లైన్లో సెర్చింగ్ స్టార్ట్ చేశారు నేటిజన్స్. ఈ షర్ట్ ధర తెలిస్తే ఖచ్చితంగా నూరేళ్లబెట్టాల్సిందే. ఈ ఇవెంట్లో విజయ ధరించిన అవుట్ ఫిట్ ధర అక్షరాల రూ.2లక్షల అని తెలుస్తుంది.