నేను ఘోరాతి ఘోరంగా మోసపోయా.. హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు..!

జబర్దస్త్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆది బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నా. తను షోస్ చేస్తూనే సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ముద్దతుగా స్టార్ క్యాంపెయినర్ క హైపర్ ఆది ఏప్రిల్ లో ప్రచారం చేస్తున్నారు. ఏప్రిల్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు షూటింగ్స్ కు బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం.

ఇండస్ట్రీలో కమెడియన్ గా స్టార్ డమ్ దక్కించుకున్న హైపర్ ఆది కెరియర్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడట. ప్రెసెంట్ గా ఆది ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాను ఇండస్ట్రీకి రావడానికి తను చాలా కష్టపడ్డాడంట. హైపర్ ఆది మాట్లాడుతూ…ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాను అని చెప్పారు. దీనితో అవకాశాల కోసం తిరుగుతున్నడంట. అప్పుడే ఆదికి ఒక ప్రొడక్షన్ హౌస్ కి వెళ్తే అక్కడ రూ. 3000 కట్టమన్నారంట.

ఏమి ఆలోచించకుండా అడిగినంత డబ్బు అక్కడ ఇచ్చి అతని ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లడంట. ఇండస్ట్రీకి వెళ్ళాలని ఎదురుచూస్తున్న ఆది తర్వాత రోజు ఎంతో ఉత్సాహంతో ఆ ప్రొడక్షన్ ఆఫీస్ కు వెళ్ళగా అక్కడ ఎవరు కనిపించలేదు. దీనితో ఒక్కసారిగా షాక్ కి గురైన ఆది. చుట్టుపక్కల వారిని అడిగాడు ఎటువంటి ప్రొడక్షన్ సంబంధించిన వారు ఎవరూ లేరు అని చెప్పారు. ఆది నుంచి డబ్బులు తీసుకున్న వారికి ఆ ప్రొడక్షన్ హౌస్ కి సంబంధం లేదని తర్వాత తెలిసిందంట. ఈ క్రమంలోనే తను మోసపోయాను అని తెలుసుకున్నాడు. అవకాశాల కోసం ప్రయత్నించే వారు ఎవరికీ కూడా డబ్బులు ఇవ్వద్దని ఆది సూచించాడు.