బాల్యంలోనే లైంగిక వేధింపులు.. వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్..?!

నటి వరలక్ష్మి శరత్ కుమార్ కు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. అంతేకాదు ఇటీవల రిలీజ్ అయిన హనుమాన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే శబరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ కథను అనిల్‌ దర్శకత్వం వహిస్తుండగా.. మహేంద్ర నాథ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నారు.

Varalakshmi Sarathkumar Chasing Releasing On December 31st | cinejosh.com

ఇక ఈ సినిమా మే 3న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ అంతా కలిసి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ గురించి, సినిమాల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఆమె ప్రస్తుతం ప్రేక్షకులు ముందుకు రానున్న శబరి సినిమాపై మాట్లాడుతూ తల్లి, కూతుళ్ళ‌ ఎమోషన్స్ చుట్టూ శబరి తిరుగుతుందని.. ఒక సింగిల్ మధ‌ర్ తన కూతురికి ఎలాంటి లోటు లేకుండా పెంచాలని భావిస్తుంది. అలాంటి టైంలో తన బిడ్డకు ఎవరైనా ఆపద తల పెట్టాలని చూస్తే ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది. కూతుర్ని ఎలా కాపాడుకుంటుంది అనేది ఈ స్టోరీ అంటూ వివరించింది.

Varalaxmi Sarathkumar interview about Sabari | cinejosh.com

ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని అంశాలు కథను కీలక మలుపు తిప్పుతాయి అంటూ వెల్ల‌డించింది. ఇక తన పర్సనల్ లైఫ్ గురించి వరలక్ష్మి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. నేను బాల్యంలోనే లైంగిక వేధింపులకు గురయ్యానంటూ చెప్పిన ఆమె.. అది నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని గాయం అంటూ వివరించింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి తెరపిస్ట్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది తమ మానసిక పరిస్థితి.. తాము పడుతున్న మాన‌సిక ఒత్తిడి గురించి ఫ్రెండ్స్ కి, పక్కన వారికి, రిలేటివ్స్ కి చెప్పాలనుకోరు. ఎందుకంటే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాదు. కనుక తెరపిస్ట్ ఉంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్ అంటూ వివరించింది.

Sabari (2024) - IMDb

మన మన సమస్యలను కుటుంబ సభ్యులతో లేదా ఫ్రెండ్స్ తో చెపితే వారు మనల్ని జడ్జ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అదే మన సమస్యలు ఒక తెరపిస్టుకు వివరిస్తే మనల్ని సరైన దారిలో నడిపించే ప్రయత్నం చేస్తారు. అందుకే ఏదైనా ప్రాబ్లం ఉంటే తెరఫీస్ట్ దగ్గరకు వెళ్లి నయం చేసుకోవడం ముఖ్యమంటూ వివరించింది వరలక్ష్మి. ప్రస్తుతం వరలక్ష్మి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవ్వడంతో అంత షాక్ అవుతున్నారు. స్టార్ కిడ్ స్టేటస్ లో ఉన్న వరలక్ష్మి లాంటి నటికే చిన్న వయసులో లైంగిక వేధింపులు ఎదురయ్యాయి అంటే.. సాధారణ ఆడపిల్లల పరిస్థితి ఇంకెలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు జ‌నం.