Tag Archives: KCR

సరే అనలేక.. సారీ అనలేక…

తెలంగాణ ముఖ్యమం‍త్రి, టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌కు ఇపుడు పెద్ద చిక్కొచ్చి పడింది. విద్యత్‌ చార్జీలు, బస్సు చార్జీల పెంపు వ్యవహారం కేసీఆర్‌ టేబుల్‌ మీదకు వచ్చింది. రాష్ట్రంలో అనేక రోజులుగా ఆర్టీసీ బస్సు చార్జీలు, విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. దీంతో ఆయా సంస్థలు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. చార్జీలు పెంచకపోతే సంస్థల మనుగడ కష్టమవుతుందని ఇప్పటికే అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై కేసీఆర్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బస్సు, విద్యుత్‌ చార్జీలు పెంచేవిషయంలో సీఎం

Read more

కేసీఆర్ వైపు చూపిస్తున్న కిషన్ వేలు

నేను ఆయనను కలవాలని చాలా సార్లు ప్రయత్నించా.. అయినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.. నేను కేంద్ర మంత్రి కావడం ఆయనకు ఇష్టం లేదేమో.. అందుకే కలవడానికి అవకాశం ఇవ్వలేదేమో.. అని కేంద్ర కేబినెట్ మంత్రి, టీ.బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ నుద్దేశించి పేర్కొన్నారు. వరి కొనుగోలు వ్యవహారం తెలంగాణలో రైతులకేమో గానీ పార్టీల మధ్య వేడిపుట్టింది. ఓ వైపు రైతులు ప్రాణాలు కోల్పోతుంటే.. కారు, కమలం పార్టీలు మాత్రం రాజకీయ గొడవలకు దిగుతున్నారు.

Read more

రామోజీ.. భజన అలా కొనసాగుతోంది…

తెలుగు మీడియాలో బాహుబలిగా చెప్పుకునే రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సీఎం కేసీఆర్‌ కుటుంబానికి భజన మీద భజన చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో కేటీఆర్‌, ఇప్పుడు కవితను పొగడ్తలతో ముంచెత్తుతూ మీడియా సర్కిల్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాడు. కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో శుభాకాంక్షలు తెలుపుతూ బహిరంగ లేఖ రాసి తన కేసీఆర్‌ ఫ్యామిలీ

Read more

అరె సార్.. జర మాట్లాడరాదె..

వరి కొనుగోలు సమస్య వచ్చిన వెంటనే అలర్ట్ అయిన సీఎం కేసీఆర్.. గంటలకొద్దీ వరుస ప్రెస్ మీట్లు.. ఇక్కడ బండి సంజయ్ మొదలు ఢిల్లీలో మోదీ మీద వరకు విమర్శలు.. కేంద్రం ఏం చేస్తలేదు.. బండి సంజయ్ నాటకాలాడుతున్నాడు.. అంటూ డైలాగుల మీద డైలాగులు.. మీరు కొంటరా..కొనరా చెప్పాలని డిమాండ్.. ఇక ఇందిరా పార్కులో ధర్నా.. కేంద్రం చెప్పి తీరాలె.. లేకపోతే ఢిల్లీ బోతం.. మెడలు వంచుతాం అంటూ ఆవేశపూరిత ప్రసంగం.. చెప్పినట్టుగానే ఢిల్లీ వెళ్లడం.. అక్కడ

Read more

కెసిఆర్,బండి అయిపోయారు …ఇక రేవంత్ వంతు..

వరి ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కరించాలని టీఆర్ఎస్, బీజేపీలు తమ ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కూడా మేము సైతం రైతు వెంటే.. అంటూ ముందకు వచ్చింది. మంచిదే.. రైతుల సమస్య పరిష్కారానికి ఎవరు పోరాడినా అందరూ మద్దతు పలకాల్సిందే. కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తే బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇపుడు రేవంత్ రెడ్డి నేత్రుత్వంలో కాంగ్రెస్ పార్టీ వరి దీక్షను ఈరోజు (శనివారం)

Read more

చిన్న బ్రేక్ తర్వాత.. కేసీఆర్ రణమే

‘ధాన్యం కొనుగోలు’ అనే పాయింట్ మీద ఒక రాష్ట్రముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని అడగడమే చాలా పెద్ద సంగతి. అయితే.. ఒకవేళ చిన్న సంగతే అయినా కూడా చాలా పెద్దగా హడావుడి చేయాలని ఫిక్సయిపోయిన కేసీఆర్.. స్వయంగా మంత్రులనుకూడా వెంట బెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. ఉత్తి చేతులతోనే తిరిగొచ్చారు. అయితే గమనించాల్సింది ఏంటంటే.. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోలేదు. ఇది చిన్న కమర్షియల్ బ్రేక్ మాత్రమా.. తర్వాత.. అసలు సినిమా ఉందని అనిపిస్తోంది. మూడురోజులుగా ఢిల్లీలోనే తిష్టవేసి అడుగుతూ

Read more

ఆ స్వతంత్రులకు సపోర్ట్ ఇస్తున్నదెవరో?

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం రసవత్తరంగా సాగుతోంది. ఎమ్మెల్యే కోటాలో అధికార పార్టీకి ఏ ఇబ్బందీ లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం తలనొప్పిగా మారనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నది 12 స్థానాలు. 12 సీట్లకు గాను 12 మంది అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. రెండు చోట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు బరిలోకి దిగారు. అసలు విషయమేమంటే.. 12 సీట్లకు గాను 102 మంది నామినేషన్లు ఫైల్ చేయడంతో

Read more

‘కారు’ తిరిగొచ్చింది..‘బండి’ బయలుదేరుతుంది

వరి కొనుగోలు వ్యవహారం రాష్ట్రంలో ఇంకా కొద్దిరోజుల పాటు కొనసాగనుంది. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు తప్పు మీదంటే మీదని ఒకరి మీద ఒకరు వేసుకుంటూ మీడియాలో నానుతున్నారు. ఎవరూ రైతుకు మేలు చేసిన దాఖలాలు కనిపించలేదు. ఓ వైపు వర్షం వచ్చి వరి ధాన్యం మొలకలెత్తుతోంది..మరోవైపు అన్నదాతలు వరిని కొనేవారు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రాజకీయాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరి సమస్యను తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్

Read more

సారు.. వచ్చేశారు సిటీకి

నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధానికి వచ్చేశారు. గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి విమానంలో సిటీలో ల్యాండ్ అయ్యారు. వరి సమస్యపై మోదీతోపాటు కేంద్ర మంత్రులను కలుస్తామని ప్రజలకు చెప్పి తన టీమ్ తో హస్తినకు వెళ్లిన కేసీఆర్ కు అక్కడ ఎవరి దర్శనమూ కాలేదు. ఎంత ప్రయత్నించినా మోదీని కలిసే అవకాశం రాలేదు. దీంతో అక్కడే ఉండి చేసేది లేక తిరిగొచ్చేశారు. విచిత్రమేమంటే నాలుగు రోజుల పాటు ఒక

Read more