వారి చేతిలో దారుణంగా మోసపోయిన.. జబర్దస్త్ రాకింగ్ రాకేష్..!!

తెలుగులో కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. పలు సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తానే హీరోగా నటిస్తూ కేసీఆర్ అనే ఒక సినిమాని తీస్తున్నారు. అయితే ఈ సినిమా తీయడం కోసం తన ఇల్లును తాకట్టు పెట్టి మరి తీస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది తనని మోసం చేశారని చెబుతూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు రాకింగ్ రాకేష్..

పలు సినిమాలలో చిన్నచిన్న పాత్రలు చేసి ఇప్పుడు ఏకంగా కోట్లు పెట్టీ కెసిఆర్ అని ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇది కేసీఆర్ జీవిత ఆధారంగా తెరకెక్కిస్తూ ఉండడంతో ఆయనపై ఇష్టంతోనే ఈ సినిమా తీస్తున్నానని స్వయంగా రాకేష్ తెలియజేయడం జరిగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా అంటే కోట్ల వ్యవహారం కదా అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని యాంకర్ అడగగా తను చాలా కష్టపడి ఇష్టంగా కట్టుకున్న ఇంటిని తాకట్టు పెట్టి మరి ఈ సినిమా తీశారని తెలిపారు. బినామీ డబ్బులతో నిర్మిస్తున్నానని వార్తలలో అసలు నిజం లేదని తెలిపారు.

ఈ సినిమా చేస్తానని కొంతమంది వ్యక్తులు తనకి మాటిచ్చారని వాళ్ళు వెనక్కి తగ్గిపోవడంతో ప్రొడ్యూసర్ కావాల్సి వచ్చిందని తెలిపారు రాకింగ్ రాకేష్.. అలాగే ఒక రైటర్ కూడా తనని మోసం చేశారని సినిమా మొదలు కాక ముందే కారు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని తెలిపారు.. ఈ సినిమా విషయంలో తన తల్లితో పాటు భార్య సుజాత తనని ఎంకరేజ్ చేసిందని తెలిపారు. అంతేకాకుండా తన భార్య బ్యాంకులో దాచుకున్న డబ్బులు కూడా ఇస్తానని చెప్పడంతో పాటు ఈ సినిమాకు రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ ఇలా అన్ని పనులు తానే చేసిందని తెలిపారు. డైరెక్టర్ గరుడవేగ అంజి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.