దేవ‌ర‌ నెగిటివ్ రోల్‌లో జాన్వి కపూర్.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన కొర‌టాల‌..

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ దేవర. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా లెవెల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియ‌న్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు కొరటాల. ఈ మూవీ రెండు పార్ట్‌లుగా రిలీజ్ కాబోతున్న సంగ‌తి తులిసిందే. మొదటి పార్ట్ సమ్మర్ కానుకగా వచ్చే ఏడది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం శ‌రవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవరల్లో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ప్రస్తుతం జాన్వి కపూర్ రోల్ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆమె పాత్రలో రెండు డిఫరెంట్ షేడ్స్‌ ఉండబోతున్నాయట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో జాన్వి కపూర్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం. ఈమె నటించే సీన్స్ నెగిటివ్గా సాగుతాయని తెలుస్తుంది. ఎన్టీఆర్‌ను అపార్థం చేసుకున్న జాన్వి కపూర్ తమకు అన్యాయం చేస్తున్నాడని భావించి ఎన్టీఆర్‌ని చంపాలని చూసే విలన్‌గా జాన్వి పాత్రను ఫస్ట్ పార్ట్ లో కొరటాల డిజైన్ చేశాడంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే జాన్వి ఎన్టీఆర్‌ని అపార్థం చేసుకోవడానికి కారణం ఏంటి.. తర్వాత ఆమె ఎలా మారుతుంది.. అనే అంశాన్ని పార్ట్ 2 లో రిలీజ్ చేస్తారట. కాగా ఈ సినిమా కోసం కొరటాల శివ లెంగ్తి స్కెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నాడు.

 

ఎన్టీఆర్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉండబోతుంది. అందుకు తగ్గట్టుగా తన పాత్ర కోసం ఎన్టీఆర్ డిఫరెంట్ మేకోవర్‌ను ట్రై చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం కొరటాల ఎన్టీఆర్ ఇద్దరు కూడా చాలా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో జనతా గ్యారేజ్ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడంతే సినిమాపై ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ స‌ర‌సన రొమాంటిక్‌గా జాన్వి కపూర్ నీ చూస్తామని భావించిన ఫ్యాన్స్ కు ఇప్పుడు జాన్వి నెగటివ్ రోల్ అని తెలియడంతో షాక్ అవుతున్నారు. మరి కొంతమంది ట్విస్ట్ అదిరిపోయింది కొర‌టాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.