పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన నిత్యామీనన్..!!

కోలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ నిత్యమీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అలా మొదలయ్యింది అనే సినిమాతో తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత ఇష్క్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, గుండెజారి గల్లంతయింది, సినిమాలతో పాటు తెలుగు తమిళంలో మలయాళం లో కూడా పలు సినిమాలలో నటించింది. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు పలు రకాల వెబ్ సిరీస్ లలో నటిస్తూ అలరిస్తోంది నిత్యామీనన్.

తాజగా నిత్యామీనన్ నటించిన మాస్టర్ పీస్ అనే వెబ్ సిరీస్లో ఒక గృహిని పాత్రలో నటించింది. రీల్ లైఫ్ లో గృహిణిగా ఆకట్టుకున్న నిత్యమీనన్ తనకు ఎలాంటి భర్త కావాలనే విషయం పైన తెలియజేయడం జరిగింది.. నిత్యామీనన్ మాట్లాడుతూ తాను పక్కా ట్రెడిషనల్ అమ్మాయిని అంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను చాలా గౌరవిస్తానని తెలిపింది.. అయితే పెళ్లి విషయంలో తనకి ఒక అభిప్రాయం ఉందని తెలియజేయడం జరిగింది. మ్యారేజ్ అనేది సోషల్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీతో ముడిపడిన సెటప్ అని తెలిపింది.

తనకు మాత్రం అలాంటి సెక్యూరిటీ లేదని అంతకుమించి ఆలోచించే వాళ్ళు దొరికితే ఖచ్చితంగా వివాహం చేసుకుంటానని తెలిపింది నిత్యామీనన్.. నిత్యామీనన్ కుటుంబ సభ్యులు బెంగళూరులో స్థిరపడిన మలయాళ కుటుంబీకులు.. నిత్యామీనన్ 8 ఏళ్ల వయసులోనే ఫ్రెంచ్ ఇండియన్ ఇంగ్లీష్ మూవీ హనుమాన్ లో కూడా నటించిందట.. హీరో మోహన్లాల్ మలయాళ చిత్ర సీమకు నిత్యామీనన్ ను పరిచయం చేశారు ఆకాశ గోపురం అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నిత్యమైన ఆ తర్వాత తెలుగు తెరకు పరిచయమైంది. నిత్యామీనన్ పెళ్లి విషయం పైన మాట్లాడిన విషయాన్ని చూస్తే ఇప్పట్లో వివాహం చేసుకొనేలా కనిపించలేదు.