కొడుకు సంతోషం కోసం ఆర్తి అగర్వాల్ ను వేడుకున్న స్టార్ హీరో..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు సైతం గుర్తుండిపోయే పాత్రలలో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ సెలబ్రిటీని అందుకున్న హీరోయిన్లలో ఆర్తి అగర్వాల్ కూడా ఒకరు. నువ్వు నాకు నచ్చావ్,ఇంద్ర,అందాల రాముడు తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఒక వెలుగు వెలిగిన ఆర్తి అగర్వాల్ కెరియర్ పరంగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఈమె కెరియర్ నాశనం అయ్యింది.

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలిగినటువంటి ఈమె అతి తక్కువ సమయంలోనే అవకాశాలను పోగొట్టుకోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఆర్తి అగర్వాల్ వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. కానీ ఆమె అధిక బరువు కావడంతో బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకున్నదట. అయితే ఆ సర్జరీ వికటించడంతో ఆమె చిన్న వయసులోనే మరణించారని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఆర్తి అగర్వాల్ మరణానికి కారణం ఇప్పటికీ పలు రకాల రూమర్స్ వినిపిస్తుంటాయి.

ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో స్టార్ హీరో తండ్రి మంచి ప్రపోసల్ ద్వారా ఆమె ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని కోట్ల ఆస్తి ఉన్న స్టార్ సెలబ్రెటీ అని హోదా కూడా పక్కనపెట్టి తన కుమారుడు సంతోషం కోసం ఆర్తి అగర్వాల్ వద్దకు వచ్చి తన కొడుకు తనని ఇష్టపడుతున్నారని వివాహం చేసుకోమంటూ ప్రపోజల్ తీసుకోవచ్చారట.. ఈ ప్రపోజల్ ఆమె రిజెక్ట్ చేశారని సమాచారం. అయితే అప్పటికే ఈమె తరుణ్ తో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అందుకే ఆ స్టార్ హీరో కుమారుడిని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది అయితే చివరికి తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయడానికి ఒప్పుకోకపోవడంతో వారికి నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుని చాలా బాధపడి చివరికి బరువు కారణంగా బరువు తగ్గడం కోసం సర్జరీ చేయించుకుని అది వికటించి మరణించింది ఆర్తి అగర్వాల్.