హీరోయిన్ తో ఆ పని చేయడానికి ఇబ్బంది పడ్డా అల్లు అర్జున్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు.. అప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగుతున్న అల్లు అర్జున్ ఏకంగా పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ అందుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్ రేంజ్ నే మార్చేసింది. ముఖ్యంగా పుష్ప సినిమాతో జాతీయ అవార్డును సైతం అందుకోవడం జరిగింది. దీంతో పుష్ప సినిమా సీక్వెల్ కూడా జరుగుతోంది.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఒక సన్నివేశంలో నటించమంటే మొండి చేశారట.. పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే ఇందులో సమంత నడుము గిల్లి చిన్న సన్నివేశం ఉండడంతో అల్లు అర్జున్ ఆ సన్నివేశం చేయనంటూ మొండి కేశారట. ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.. అల్లు అర్జున్ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనంటూ తెలియజేస్తున్నారు..

ముఖ్యంగా ఈ స్పెషల్ సాంగ్ లోని ఎన్నో సన్నివేశాలను చాలా టేక్స్ తీసుకోవడం జరిగింది. ఈ విషయంపై సుకుమార్ ఎంత చెప్పినా కూడా అల్లు అర్జున్ చేయలేదట. అయితే సమంత కూడా ఇదంతా కేవలం సినిమాలోని ఒక భాగమే కదా అంటూ అల్లు అర్జున్ కి ధైర్యం చెప్పిన వినలేదట. కానీ చివరికి సుకుమారు సీరియస్ అవ్వడంతో కేవలం తన నడుమును గిల్లినట్టుగా యాక్ట్ చేశారట అల్లు అర్జున్. ఈ సన్నివేశాన్ని కేవలం విజువల్స్ తో గిల్లుతున్నట్లుగా చూపించారట సుకుమార్. అయితే ఇదంతా కేవలం స్నేహ రెడ్డి భయం వల్లే జరిగిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.