ప్రతీ వారం ఆ పని చేయాల్సిందే.. లేకపోతే? – బిపాషా బసు..!

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ఫిట్నెస్ క్వీన్ బిపాషా బసు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ప్రధానంగా హిందీ సినిమాలలో నటించింది. అంతేకాదు తెలుగు, తమిళ్, బెంగాలీ, ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటించి అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.ఇకపోతే తన నటనతో అనేక పురస్కారాలను కూడా సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

సెక్స్ సింబల్గా మీడియా చేత పిలవబడే ఈమె ఎంతో మోడ్రన్ గా కనిపిస్తూ అందరిని అలరిస్తూ ఉంటుంది. అయితే అలాంటి ఈమె సడన్గా ఒక విషయం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. అసలు విషయంలోకెళితే ప్రతి వారం కూడా ఆ పని చేయాల్సిందే లేకపోతే నిద్ర కూడా పట్టదు అంటూ ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక అసలు విషయంలోకెళితే… ఫిట్నెస్ క్వీన్ గా భారీ పాపులారిటీ దక్కించుకొని మోడ్రన్ గర్ల్ గా బాలీవుడ్ లో మరింత పేరు దక్కించుకున్న ఈమెకు దిష్టి మీద నమ్మకం ఎక్కువట.

అందుకే ప్రతి శనివారం కూడా నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు కొనుగోలు చేసి వాటిని ఒక ఇనుప తీగకు గుచ్చి.. కారు విండ్ షీల్డ్ కున్న రియర్ వ్యూ మిర్రర్ కి వేలాడదీస్తుందట. ఇక ఈ ప్రాక్టీస్ ని తాను వాళ్ళ అమ్మ నుంచి నేర్చుకున్నానని చెబుతూ ఉంటుంది. ఈ విషయం తెలిసి నెటిజన్లే కాదు ఆమె అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు . ఈ కాలంలో కూడా మీరు ఇలాంటివన్నీ నమ్ముతారా? అందులో ఒక మోడ్రన్ హీరోయిన్ కూడా ఇలాంటివి ఇంకా పాటిస్తారా ? అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఎంత పెద్ద వారైనా సరే ఇలాంటివి నమ్మాల్సిందే కదా అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.