ప్రముఖ యూట్యూబ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా మారిన విషయం తెలిసిందే . బేబీ సినిమాతో ఆమె హీరోయిన్గా మారింది . సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది . ఇప్పుడు ఆమె తాజాగా నటించిన మరో సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది . మనకు తెలిసిందే.. దిల్ రాజు వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆశిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా లవ్ మీ . ఈ సినిమాలో బేబీ లో బ్లాక్ బస్టర్ కొట్టిన వైష్ణవి చైతన్య హీరోయిన్గా చేయబోతుంది .
దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మాణంలో అరుణ్ దర్శకత్వలో ‘లవ్ మీ’ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఇప్పటివరకు మనం చూడని సరికొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కించబోతున్నట్లు .. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆధారంగా తెలుస్తుంది . టైటిల్ తోనే సగం హిట్ కొట్టేసాడు . డైరెక్టర్ లవ్ మీ ఇఫ్ యు దేర్ అనే క్యాప్షన్ కూడా పెట్టాడు . ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉండడం బిగ్ బిగ్ ప్లస్ పాయింట్ అనేది చెప్పాలి .
టీజర్ విషయానికి వస్తే ట్రైలర్ విషయానికి వస్తే ఈ సినిమా సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్నట్లు క్లియర్గా అర్థమైపోతుంది . అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది , హీరో దెయ్యాన్ని వెతుక్కొని వెళ్లి మరి ఆ దయ్యాన్ని ప్రేమిస్తాడు ఇలాంటి కాన్సెప్ట్ .. ఇప్పటివరకు ఏ డైరెక్టర్ టచ్ చేస్తే సాహసం చేయలేదు. అందర్నీ చంపేసే దయ్యంని హీరో ఎందుకు లవ్ చేస్తున్నాడు ..? అసలు ఆ హీరోని మాత్రమే దయ్యం ఎందుకు వదిలేస్తుంది ..? అనేది ఆసక్తికర పాయింట్. హారర్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు క్లియర్గా అర్థం అయిపోతుంది . కచ్చితంగా ఈ సినిమాతో వైష్ణవి చైతన్య మరో హిట్ తన ఖాతాలో వేసుకోబోతుంది మరి ఎందుకు ఆలస్యం అందర్నీ అల్లరిస్తున్న ఆ ట్రైలర్ పై మీరు ఓ లుక్ వేయండి..!