దేవర – పుష్ప2 రికార్డులను బ్రేక్ చేయాలి అంటే ఆ స్టార్ హీరోకే సాధ్యం. ఇంతకీ ఆయన ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా రికార్డ్స్ మరొక సినిమా బ్రేక్ చేయడం సర్వసాధారణం . అలా బ్రేక్ చేస్తేనే అసలైన కిక్ మజా వస్తుంది. అయితే ప్రెసెంట్ కోట్లాదిమంది ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై హై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా కోసం ఏకంగా 150 కోట్లు తీసుకుంటున్నాడు బన్నీ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది .

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా సూపర్ డూపర్ క్రేజీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అన్న నమ్మకం అందరిలోనూ ఉంది . ఆ తర్వాత ఈ సినిమాను ఢీకొట్టే రికార్డ్స్ సాధించాలి అంటే అది కచ్చితంగా ఎన్టీఆర్ నటిస్తున్న దేవర వల్లే సాధ్యం అంటున్నారు అభిమానులు . దేవర సినిమా అక్టోబర్ 10వ తేదీ దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది . అయితే ఈ రెండు సినిమా రికార్డ్స్ బ్రేక్ చేయాలి అంటే ఒకే ఒక్క హీరోకి సాధ్యం అంటున్నారు అభిమానులు .

ఆయనే ప్రభాస్.. ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కే స్పిరిట్ సినిమానే ఈ రెండు సినిమా రికార్డులను బద్దలు కొట్టే అంత స్టామినా ఉంది అంటూ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా బాగా ట్రెండ్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా లో ప్రభాస్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో కనిపిస్తాడు అన్న విషయం తెలుసుకుని షాక్ అయిపోతున్నారు అభిమానులు. ఈగర్ గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు..!!