ఇండస్ట్రీ లోకి వచ్చాక కీర్తి సురేష్ ఎంత సంపాదించిందో తెలుసా.. అది మహానటి రేంజ్..?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ కిర్తీ సురేష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నేను శైలజ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన అందం అభినాయంతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా హిట్ కావడంతో వరుస ఆఫర్లను అందుకున్న కీర్తి.. మహానటి సినిమాతో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఈ సినిమా కీర్తి లైఫ్ ట‌ర్నింగ్ మూవీ అన‌డంలొ ఎటువంటి సందేహం లేదు. మహానటి సినిమాతో భారీ పాపులారిటి దక్కించుకున్న కీర్తి సురేష్ విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు ఉత్తమమ నట్టిగా జాతీయ అవార్డ్‌ దక్కించుకుంది.

Watch Nenu Sailaja (Telugu) Full Movie Online | Sun NXT

దీంతో కీర్తి సురేష్ కు సౌత్ ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ఒక్కసారిగా స్టార్ బ్యూటీగా మారిన కీర్తి.. తర్వాత బాలీవుడ్ పై తన ఫోకస్ మార్చింది. అక్కడ వరుస సినిమాలను నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఈ క్రమంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఈమె సంపాదన ఆస్తుల వివారాల‌పై నెటింట చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి రూ.41 కోట్ల ఆస్తిని కూడ‌బెట్టింద‌ని టాక్‌.

Mahanati' box office collections: Keerthy Suresh, Dulquer Salmaan, Samantha  and Vijay Deverakonda inches towards the $2M mark | Telugu Movie News -  Times of India

ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ అమ్మడు.. పలు ప్రకటనలు, టెలివిజన్ కార్యక్రమాల ద్వారా కూడా సంపాదిస్తుంది. అలాగే ప్రతి ఎండాస్మెంట్ కు ఐ ఎన్ ఆర్ రూ.30 లక్షల వరకు చార్జ్‌ చేస్తుంది కీర్తి. ఇన్ స్టాలో త‌ను స్పాన్సర్ చేసిన ప్ర‌తి పోస్ట్ కు రూ.25 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుందట. చెనైలో విలాసంతమైన బంగ్లా, హైదరాబాద్‌.. జూబ్లీహిల్స్ లో అపార్ట్మెంట్‌తో పాటు కోట్ల విలువ చేస్తే వోల్వో S90, మెర్సడేస్ బెంజ్ AMG GLC 43, టయోటా, బీఎండబ్ల్యూ సెవెన్ సిరీస్730 ld లాంటి ఎన్నో లగ్జరీ కార్లు కూడా త‌న గ్యారేజ్‌లో ఉన్నాయి.