సుమను కోరిక తీర్చమన్న స్టార్ హీరో.. సెన్సేషనల్ గా మారిన వీడియో..!

ఇండస్ట్రీలో యాంకర్ సుమకు ఎలాంటి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో .. గౌరవం ఉందో మనం సెపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు .. తనదైన స్టైల్ లో దూసుకుపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా యాంకర్ సుమ పలు సినిమాల్లో కూడా నటించి తన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెంచేసుకుంది . కాగా యాంకర్ సుమ పలు షోస్ ని హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా సుమా అడ్డ షో బాగా హ్యూజ్ టీఆర్పీల ను సొంతం చేసుకుంటూ ఉంటుంది . ఈ షోలో సుమ చేసే అల్లరి కామెడీ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ సినిమాలో హీరో కార్తికేయ సందడి చేశారు. అంతేకాదు భజే వాయువేగం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుమా అడ్డ షోకి హాజరు హాజరయ్యారు కార్తికేయ . హీరోతో పాటు చిత్ర యూనిట్ మొత్తం కూడా హాజరైంది . కాగా అందరిని తనదైన స్టైల్ లో ఆకట్టుకునే సుమా ఈసారి కార్తికేయ చేతుల్లో అడ్డంగా ఇరుక్కుపోయింది . పలు రివర్స్ పంచెస్ వేస్తూ.. కార్తికేయ సుమను ఆడేసుకున్నాడు . మరి ముఖ్యంగా యాంటీ మేకప్ ఫోర్స్ అంటూ తెలుగు భాషలో నాకు నచ్చని పదం అంటే మేకప్ అని కార్తికేయ చెప్తాడు .

దీంతో సుమ అది తెలుగు పదం కాదు అంటూ పంచ్ వేస్తుంది . దీనికి వెంటనే హీరోయిన్ ఐశ్వర్య ను ఉద్దేశిస్తూ మేకప్ వేసుకోవడం కాదు మేకప్ నే ఆమె ని వేసుకుంది అంటాడు . సరదా సంభాషణ బాగా నవ్వులు పూయిస్తుంది . అంతేకాదు సుమ తర్వాత షోలోకి ఒక జ్యూస్ తీసుకొస్తుంది. ఆ జ్యూస్ తాగితే మనసులో కోరిక నెరవేరుతుంది అని చెబుతుంది . సుమ నా సినిమాను ప్రొడ్యూస్ చేయాలి అంటూ కార్తికేయ అడుగుతారు . దీంతో సుమ ఒక్కసారిగా షాక్ అయిపోయింది . “అదే నా కోరిక సుమ గారు అంటూ షాక్ ఇచ్చాడు కార్తికేయ”. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సుమకు భలే షాక్ ఇచ్చాడే కార్తికేయ అంటూ జనాలు ఫన్నీగా ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు..!!