“పవిత్ర యాక్సిడెంట్ లో చనిపోలేదా..? చంపేశారా..?”..షాకింగ్ విషయాని బయటపెట్టిన భర్త..!

రీసెంట్ గానే రోడ్డు యాక్సిడెంట్లో కన్నడ సీరియల్ యాక్టర్స్ పవిత్ర జయరాం మరణించిన విషయం తెలిసిందే.. చాలా చిన్న ఏజ్ లోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు . అంతేకాదు కుటుంబ సభ్యులు తోటి నటీనటులు ఆమె మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ..ఆమె లేని లోటు ఎవరు తీర్చలేనిది అంటూ ఎమోషనల్ గా స్పందిస్తున్నారు. మే 12న మహబూబ్ నగర్ జిల్లా సమీపంలో రోడ్డు ప్రమాదం జరగడంతో అక్కడికక్కడే స్పాట్లో మృతి చెందింది బుల్లితెర నటి పవిత్ర జయరామ్ .

కాగా ఈ ప్రమాదం గురించి తన భర్త సంచలన విషయాన్ని బయట పెట్టారు . పవిత్ర భర్త చంద్రకాంత్ ఆమె యాక్సిడెంట్లో చనిపోలేదు అంటూ చెప్పి బిగ్ షాక్ ఇచ్చాడు . ఆయన మాట్లాడుతూ..” మేము కారులో ప్రయాణిస్తున్నాం ..అయితే మా పక్కనే ఆర్టీసీ బస్సు ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేసింది. దీంతో డ్రైవర్ కారును కుడివైపుకు తిప్పాడు.. అప్పుడు ఆ కార్ డివైడర్ను ఎక్కి యాక్సిడెంట్ జరిగింది. ”

“అయితే అప్పుడు నాకు తగిలిన గాయాలు చూసి పవిత్ర షాక్ అయిపోయింది.. ఆ షాక్ వల్ల ఆమెకి కార్డియాడిక్ అరెస్ట్ వచ్చింది . హార్ట్ ఎటాక్ రావడం వల్ల పవిత్ర మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది . అంతేకాదు మేము వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేశాము.. కానీ అంబులెన్స్ చాలా నెగ్లెజెన్సీ గా బిహేవ్ చేసింది ..20 నిమిషాలు లేటుగా రావడం వల్లే నా భార్య పవిత్ర తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది “అంటూ ఎమోషనల్ గా స్పందించాడు. దీనితో సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది..!!