ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ ఇద్దరు కొడుకులు.. నాన్ననే మించిపోతున్నారుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా ఎన్నిసార్లు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ దేవర అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాల షెడ్యూల్స్ లో బిజీబిజీగా ముందుకెళ్తున్నాడు తారక్ . కాగా రీసెంట్గా తారక్ తన ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఫారిన్ కంట్రీస్ కి వెళ్లారు.

తన పుట్టినరోజు రాబోతూ ఉండడంతో పూర్తి టైం ఫామిలీకే కేటాయించాలి అన్న ఉద్దేశంతో విదేశాలకు వెళ్ళినట్టు తెలుస్తుంది . కాగా రీసెంట్గా తారక్ కి సంబంధించిన ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని జక్కన్నపేటలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి మన జూనియర్ ఎన్టీఆర్ భారీ విరాళం ఇచ్చారట. జగ్గన్నపేట భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయానికి దాదాపు ఎన్టీఆర్ 12 లక్షల 50 వేల రూపాయలు విరాళం ఇచ్చినట్లు తెలుస్తుంది .

దీంతో గుడి బయట దాతల పేర్లను రాళ్లపై రాయించగా అందులో ఎన్టీఆర్ ఫ్యామిలీ పేర్లు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా భార్గవ్ రామ్ – అభయ్ రామ్ పేర్లు కూడా అక్కడ రాయడంతో ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ ట్రెండ్ చూస్తున్నారు అభిమానులు. దీంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో నాన్నకు మించిన రేంజ్ లో భార్గవ్ రామ్ – అభయ్ రామ్ పేర్లు ట్రెండ్ అవుతున్నాయి..!!