సాయి పల్లవి, శ్రీ లీల లో ఉన్న‌ కామన్ క్వాలిటీస్‌ ఏంటో తెలుసా.. అస‌లు గెస్ చేయ‌లేరు..?!

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీ‌లీల, నాచురల్ బ్యూటీ సాయి పల్లవికు తెలుగు ప్రేక్షకులో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీరిద్దరిలో ఓ కామన్ పాయింట్ ఉందంటూ ప్రస్తుతం న్యూస్ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ కామన్ పాయింట్ ఏంటో ఒకసారి చూద్దాం. వీరిద్దరూ ఒకరిని మించి ఒకరు డ్యాన్స్ స్టెప్పులతో ప్రేక్షకుల ఆకట్టుకుంటారు అన్న సంగతి తెలిసిందే . స్టార్ హీరోలతో పోటీపడి మరి వీరు తమ స్టామినా చూపుతూ ఉంటారు. అయితే వీరిద్దరిలో డ్యాన్స్‌లో మాత్రమే కాకుండా మరో విష‌యంలోను కామ‌న్ పాయింట్ ఉంది. ఇంతకీ అది ఏంటో ఒకసారి చూద్దాం.

ఈ ఏడది గుంటూరు కారం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి నాన్ స్టాప్ స్టెప్పులతో అదరగొట్టింది శ్రీలీల. చిన్నప్పటి నుంచి ఎన్నో స్టేజీలపై డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ల‌తో అద‌ర‌గొట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ ఎక్స్పీరియన్స్ తోనే తాను నటిగా ఎదగాలని భావించింది. అయితే డాక్టర్ కావాలనేది తన లైఫ్ గోల్ అంటూ ఇప్పటికే చాలా సందర్భాల్లో వివరించింది. ఇక‌ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి చిన్నతనం నుంచి డ్యాన్స్‌ అంటే విపరీతమైన ఇష్టం ఉండేది. దీంతో పలు షోల‌లో పాల్గొని తన సత్తా చాటుకుని విన్నర్ గాను నిలిచింది. మెల్లమెల్లగా హీరోయిన్గా అవకాశాలు అందుకుంటు స్టార్ హీరోయిన్గా మారింది నాచురల్ బ్యూటీగా.

Sai Pallavi FC™ on X: "Happy doctor's day to all the doctors here! Salute  To all for your service to the society. #DoctorsDay And Especially Happy  Doctor's day My Dear "" Dr.

ఇక‌ ఈ ఏడాది ఉత్తరాదిలోనూ అడుగు పెట్టింది. సౌత్ లో తానేంటో ప్రూవ్ చేసుకున్న సాయి పల్లవి.. కుటుంబంలో అంతా చదువుకున్న వారు కావడంతో మొదటి నుంచి చదువుకు కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉండేదని వివరించింది. ఇక డాక్టర్ కావాలని ఆమె మొద‌ట నుంచి భావించేదట. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండడంతో తన గోల్ రిచ్ కాలేకపోతున్నానని.. ఏదో రోజు వైద్యాన్ని ప్రాక్టీస్ చేసి కచ్చితంగా డాక్టర్ పట్టా అందుకుంటానని.. అటు నటనైనా ఇటువైద్యమైన జనాల దగ్గర ఉండే అవకాశం ఉంటుందని ఈమె వివరించింది. ఇలా వీరిద్దరూ యాక్టింగ్ లోను, అలాగే వైద్య వృత్తిలోనూ తామేంటో ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

USPLUSUK (@USPLUSUK) / X