స్టార్ హీరో కాజల్ కి అలాంటి సలహా ఇచ్చాడా..? మహా నాటీ ఫెలోనే రా బాబు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా కూడా చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ పేరు చెప్తే వచ్చే కిక్ వేరే లెవెల్ లో ఉంటుంది. అందానికి అందం నటనకి నటన అభినయానికి అభినయం.. అంతేకాదు ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎలా అయినా సరే కుర్రాలను ఆకట్టుకునేస్తారు హీరోయిన్స్ .. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ మైంటైన్ చేయడం చాలా చాలా కష్టం . అయితే అది తనకి ఈజీ అంటూ ప్రూవ్ చేసుకునేది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ .

కాజల్ అగర్వాల్ సెకండ్ న్యూస్ లో కూడా దూసుకుపోతుంది. ఆమె నటించిన ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా సత్యభామ మే 31వ తేదీ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్.. సాంగ్స్ అభిమానులకి హై ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి . తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ స్టార్ హీరో అల్లు అర్జున్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది . అల్లు అర్జున్ తో తనకున్న స్పెషల్ బాండింగ్ గురించి బయట పెడుతూ..” అల్లు అర్జున్ నేను మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటికీ నాకు అల్లు అర్జున్ పరోక్షకంగా హెల్ప్ చేస్తూనే ఉంటాడు”..

” అది ఎలా అంటే కెమెరా ఆఫ్ చేశాక కూడా కొంచెం సేపు మనం అదే ఎమోషన్ లో ఉండాలి అంటూ నాకు ఒకప్పుడు సలహా ఇచ్చాడు.. అది ఎడిటింగ్ సమయంలో ఉపయోగపడుతుందట . అప్పటి వరకు నాకు ఆ విషయం తెలీదు.. ఆ సలహా నాకు ఎంతగానో ఉపయోగపడింది . ఇప్పటికీ నేను అదే సలహాను పాటిస్తున్నాను “అంటూ బన్నీతో ఉన్న స్పెషల్ బాండింగ్ గురించి బయటపెట్టింది కాజల్ అగర్వాల్ . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. సత్యభామ సినిమా హిట్ అయితే కాజల్ కెరియర్ ఏ రేంజ్ లో దూసుకుపోతుందో అన్న విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు..!!