త్వరలోనే విడాకులు తీసుకోనున్న మరో స్టార్ కపుల్.. అందుకే అలా చేశాడా..?!

బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనాకపూర్ గురించి టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2012లో వీరిద్దరూ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. బి టౌన్ లోనే హాటెస్ట్ పాపులర్ సెలబ్రిటీస్ లో ఒకరైన ఈ జంట.. సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ సందడి చేస్తూనే ఉంటారు. ఎల్లప్పుడు వారికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా సైఫ్ చేతిపై కనిపించినా కొత్త టాటూ హాట్ టాపిక్ గా మారింది.

What was the reason Kareena Kapoor married Saif Ali Khan? - Quora

చాలా సంవత్సరాల క్రితం తన భార్య కరీనాకపూర్ ఖాన్ పేరును తన చేతి పై టాటూగా వేయించుకున్న సైఫ్.. తాజాగా ముంబై ఎయిర్పోర్టులో కనిపించాడు. అయితే సైఫ్ చేతి పై కరీనా టాటూను తొలగించి కొత్త టాటూ ఉండడంతో అందరూ షాక్ అవుతారు. కరీనా పేరుకు బదులుగా ఆయన చేతిపై త్రిశూలం టాటూ ఉండడంతో.. ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది చూసిన అభిమానులంతా వీరిద్దరి మధ్యన ఏదైనా గొడవలు జరుగుతున్నాయా.. త్వరలోనే వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారా.. సైఫ్ స‌డ‌న్‌గా క‌రీనా టాటు ఎందుకు తీయించేశాడు అంటూ తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

అయితే సైఫ్ చేతి పై ఉన్న త్రిశేల్‌ టాటూ కేవలం టెంపరరీ టాటూ అని తెలుస్తోంది. ప్రస్తుతం సైఫ్‌, ఎన్టీఆర్ దేవర షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసమే అతను ఆ ప్రత్యేక టాటూను వేయించుకున్నట్లు తెలుస్తోంది. కరీనా పేరు పై త్రిశూల డిజైన్ ఇంక్‌ చేశారని.. షూటింగ్ పూర్తయిన తర్వాత త్రిశూల్ టాటూను తొలగిస్తే కరీనా టాటూ కనిపిస్తుందని స‌మాచారం. ఈ న్యూస్ వైర‌ల్ కావ‌డంతో కరీనా, సైఫ్ విడాకులు తీసుకుంటున్నారు అంటూ వస్తున్న సందేహాలకు చెక్ పడింది.