“నా కెరీర్ లో పరమ చెత్త సినిమా అదే”..లయ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లయకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేయించుకుంది . మరీ ముఖ్యంగా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . వకీల్ సాబ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న స్టార్ట్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హీరో నితిన్ నటిస్తున్న సినిమా తమ్ముడు.

ఈ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంది లయ . ఈ సినిమాలో నితిన్ కి అక్క పాత్రలో కనిపించబోతుంది. తాజాగా ఆలీతో సరదా షోలో గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ . ఇదే క్రమంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు బయట పెట్టింది. అంతేకాదు లయ తన కెరీర్ లో చేసిన పరమ చెత్త సినిమా గురించి కూడా బయట పెట్టింది. దీంతో అభిమానులు ఆ విషయం తెలుసుకుని షాక్ అయిపోతున్నారు.

స్వయంవరం లాంటి సూపర్ డూపర్ హిట్ అందుకున్న తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో మా బాలాజీ అనే చిత్రంలో ఆఫర్ వచ్చిందని.. అయితే అది ఇష్టం లేకుండానే చేశాను అని .. కోడి రామకృష్ణ గారి పై ఉన్న గౌరవంతో ఆయన అడిగి అడగగానే ఆ సినిమా చేశానని .. ఆ సినిమా కారణంగానే తన లైఫ్ స్పాయిల్ అయిపోయింది అని .. తన కెరియర్ లో అదే పరమ చెత్త సినిమా అని చెప్పుకొచ్చింది . సోషల్ మీడియాలో లయ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!