ఫస్ట్ టైం ఆ విషయం కారణంగా ట్రోలింగ్ కి గురి అవుతున్న రష్మిక మందన్నా.. పాప అడ్దంగా బుక్కైపోయిందే..!

పాపం తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు హీరోయిన్ రష్మిక మందన్నా.. ఏదో ఊహించుకొని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఇప్పుడు ఆ పోస్ట్ నెట్టింట ట్రోలింగ్కి గురవుతుంది . ఆమెను జనాలు హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురైయేలా చేస్తున్నారు . ముంబైలోని అటల్ సేతుపై రష్మిక స్పందిస్తూ రెండు గంటల ప్రయాణాన్ని 20 నిమిషాలలో పూర్తి చేయగలిగే ఈ వంతెన నిజంగా అద్భుతం అని పొగిడేసింది.

అంతటితో ఆగలేదు ఇండియా బాగా డెవలప్ అయింది అని రహదారి ప్రణాళిక అద్భుతంగా ఉన్నాయి అంటూ పోస్టులో మెన్షన్ చేసింది . అక్కడే అమ్మడు అడ్డంగా దొరికిపోయింది . రష్మిక మందన్నా పై హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురయ్యేలా చేసింది . ఒకసారి కారు దిగు మేడం నీకు అప్పుడు ఇండియాలో పరిస్థితి తెలుస్తుంది అంటుంటే .. మరికొందరు డబ్బున్న వాళ్ళకి అన్ని బాగానే ఉంటాయి .. కారు దిగి రోడ్డుపై నడిస్తే కానీ తెలుస్తుంది నీకు పరిస్ధితి అంటూ మండిపడుతున్నారు .

మరికొందరు అటల్ సేతుపై కాదు ముంబై లోకల్ ట్రైన్ ఎక్కు మౌలిక సదుపాయాలు ఏమాత్రం మెరుగుపడ్డాయో తెలుస్తుంది అంటూ మండిపడుతున్నారు . పాపం రష్మిక ఏదో అనుకొని పోస్ట్ పెడితే మరి ఏదోలా ట్రోలింగ్కి గురవుతుంది అంటూ జనాలు జాలి చూపిస్తున్నారు. ప్రజెంట్ రష్మిక తన చేతిలో ఆరు సినిమాలను పట్టుకొని ఉంది. వీటిలో కచ్చితంగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హీట్ అవుతాయి. తెలుగులో మూడు బాలీవుడ్ లో మూడు సినిమాలతో బిజీ బిజీగా దూసుకుపోతుంది రష్మిక మందన్నా..!