ప్రభాస్-అనసూయ కాంబోలో మిస్ అయిన ఆ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అందాల ముద్దుగుమ్మ అనసూయ – ప్రభాస్ తో నటించే ఛాన్స్ మిస్ చేసుకుందా..? అంటే అవును అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. ప్రభాస్తో నటించే ఛాన్స్ వస్తే ఏ మద్దుగుమ్మ కూడా మిస్ చేసుకోరు ఆ విషయం అందరికీ తెలిసిందే . కాగా అనసూయ కొన్ని కారణాల చేత ఆ రోల్ మిస్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట .ఆ సినిమా మరేదో కాదు మిస్టర్ పర్ఫెక్ట్ .

ఎస్ ప్రభాస్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం అనసూయను అప్రోచ్ అయ్యారట మేకర్స్. సెకండ్ హీరోయిన్ గా నటించిన తాప్సి సిస్టర్ క్యారెక్టర్ లో అనసూయకు ఒక రోల్ ఫిక్స్ చేశారట. కానీ అనసూయ భారీ స్థాయిలో ఉండే రోల్ ని ఎక్స్పెక్ట్ చేయడంతో ఈ ఆఫర్ రిజెక్ట్ చేసిందట . అలా ప్రభాస్తో నటించే అవకాశాన్ని మిస్ చేసుకుని అనసూయ అంటూ ఓ న్యుస్ వైరల్ గా మారింది .

అంతేకాదు ఆ తర్వాత అనసూయ – ప్రభాస్ కాంబోలో ఒక్క సినిమా కూడా సెట్ కాకుండా పోవడం గమనార్హం. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా అనసూయ ప్రజెంట్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో కీలక రోల్స్ లో నటిస్తూ మెప్పిస్తుంది. మరీ ముఖ్యంగా గ్లోబల్ స్థాయిలో అదరగొట్టేసే పుష్ప2 సినిమాలో కీలకపాత్రలో దాక్షాయిని రోల్ లో మెప్పించబోతుంది . దీనికి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నయ్. రీసెంట్ గా ఆమె బర్త డే సంధర్భంగా ఒక లుక్ ని కూడా రివీల్ చేశారు మేకర్స్ . చాలా బోల్డ్ గా గంభీరంగా అమ్మడు కనిపించడం అభిమానులకి హై ఎక్స్పెక్టేషన్స్ పెంచేలా చేసింది..!!