మీకు త‌ర‌చు టీ తాగే అలవాటు ఉందా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..?!

ప్రపంచంలో అత్యధికంగా జనాలు ఇష్టపడే పానీయాల్లో టీ ఒకటి. చాలా మందికి ప్రతిరోజు టీ ని తాగే అలవాటు ఉంటుంది. అలాంటి వారు ఒక్క పూట టీ తాగ‌క‌పోయినా అదేదో సమస్యల ఫీల్ అవుతూ ఉంటారు. రోజంతా ఏదో మిస్ అయిన ఫీలింగ్ తో ఉంటారు. అయితే టీ తరచు తాగడం వల్ల కూడా ఎన్నో దుష్ప్రభావాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. టీ తాగే అల‌వాటు తో ఎదుర‌య్యే స‌మ‌స్య‌లేంటో ఒకసారి చూద్దాం.

శ‌రీరానికి త‌గ్గిన పోషకాహారం ల‌భించ‌క‌పోతే ఐరన్ లోపం సంభ‌విస్తుంద‌న సంగ‌తి తెలిసిందే. అలాంటి వారు అధికంగా టీ తీసుకోవడం వల్ల ఐర‌న్ లోపం మరింతగా పెరుగుతోందట. టీ అధిక‌మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల‌ ఆందోళన, ఒత్తిడి మరింతగా పెరుగుతుందని.. మెదడుకు విశ్రాంతి లేకుండా చేస్తుంది.. నిపుణులు చెబుతున్నారు. టీలో సహజంగా కెఫెన్ వండడం వల్ల అధికంగా టీ తీసుకోవడంతో నిద్ర భంగం కలుగుతుంది. కాళి కడుపుతో టీ తాగితే అందులో ఉన్న సమ్మేళనాలు వికారం కలిగించే ప్రమాదం ఉంది.

టీలో కెఫిన్ గుండెల్లో మంట కారణం కావచ్చు. ముందుగా ఉన్న ఎసిడిటీ సమస్యలను మరింత తీవ్రం చేస్తే ప్రమాదం ఉంది. గ‌ర్భ‌దారణ సమయంలో టీ ని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అధిక కెఫెన్ కారణంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎక్కువ మోతాదులో టీ తాగడం వల్ల అందులోని కెఫెన్ కారణంగా తల తిరగడం, కళ్ళు బైర్లు క‌మడం లాంటి సమస్యలు తలెతుత్తాయి. కనుక రోజుకి ఒకటి లేదా రెండు సార్లు టీ తాగడం అనేది సాధారణం. అంతకుమించి ఎక్కువగా టీ తాగే అలవాటు ఉంటే దాన్ని మానుకోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.