అమ్మ బాబోయ్..పూరి జగన్నాధ్ తరువాత వర్క్ చేయబోయేది ఆ హీరోతోనా..?

ఈ న్యూస్ తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు. మనకు తెలిసిందే.. పూరి జగన్నాథ్ కి ఒకప్పుడు ఉన్నంత క్రేజ్ .. పబ్లిసిటీ పాపులారిటీ ఇప్పుడు లేదు . అది అందరికీ తెలిసిన విషయమే . మరీ ముఖ్యంగా లైగర్ సినిమా ఫ్లాప్ అవడంతో పూరి జగన్నాథ్ కెరీర్ ఢమాల్ అంటూ పడిపోయింది. కాగా రీసెంట్గా పూరి జగన్నాథ్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. పూరి జగన్నాథ్ ప్రెసెంట్ రాంపోతినేనితో డబల్ ఇస్మార్ట్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు .

మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా కంప్లీట్ అయిపోతుంది. అయితే ఆ తర్వాత పూరి జగన్నాథ్ తెరకెక్కించే సినిమాలో హీరో ఎవరు అనే విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. ఓ సర్ప్రైజింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరోతో పూరి జగన్నాథ్ సినిమాను ఓకే చేయబోతున్నారట . ఆయన మరెవరో కాదు తేజ సజ్జ.

యస్..రీసెంట్ గా హనుమాన్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న తేజ సజ్జాతో పూరి జగన్నాథ్ తన నెక్స్ట్ సినిమాను చేయబోతున్నాడట. ఇది మొత్తం కూడా ఇడియట్ రేంజ్ లో ఉండే కధా అంశంతో తెరకెక్కబోతుందట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. పూరి జగన్నాథ్ లాంటి ఫ్లాప్ డైరెక్టర్ కి తేజ ఎలా కాల్ షీట్స్ ఇచ్చాడు అనేది ఇప్పుడు వైరల్ గా మారింది..!!