ఆ విషయం ప్రభాస్ కు గట్టి పోటీ ఇస్తున్న బన్నీ.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్.. ర‌ష్మిక జంట‌గా న‌టించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మూవీ పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ అందుకోవడంతో పాటు అల్లు అర్జున్‌కు ఈత్త‌మ న‌టుడిగా నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కేలా చేసింది. ఈ క్ర‌మంలో ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మూవీ టీం అంతా ఇప్పుడు ఈ సీక్వెల్ పైనే ఫోకస్ పెట్టారు. అ క్ర‌మంలో సినిమా ప్రమోషన్స్ కూడా కొత్తగా ప్లాన్ చేస్తున్నారట‌ మేకర్స్. ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో భారీ ప్రమోషన్స్ చేయనున్నారు.

Pushpa: The Rule - Part 2 (2024) - Photo Gallery - IMDb

ఇటు నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న కల్కి టీం కూడా ప్రమోషన్స్ కోసం సిద్ధమవుతున్నారు. అశ్వద్ధామగా ప్ర‌భాస్‌ ఎలా ఉంటారో గ్లింప్స్‌ రిలీజ్ చేసి పాన్ ఇండియా లెవెల్‌లో అభిమానులను ఆకట్టుకున్నారు మేకర్స్. క్రికెట్ మ్యాచ్ల వేదికల మీద కల్కి అప్డేట్స్ కూడా ఇచ్చి కొత్త ట్రెండ్ సృష్టించారు. ఆగస్టులో రిలీజ్ అయ్యే పుష్ప 2 కోసం ఎప్పటినుంచే ప్రమోషన్స్ మొదలుకానున్నాయట.

Netizens ecstatic as 'Kalki 2898 AD' unveils new poster and release date

ఇంకోవైపు జూన్ 27న రిలీజ్ సిద్ధమవుతున్న కల్కి ప్రమోషన్స్ కోసం టీం స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే ప్ర‌మోష‌న్స్ కూడా వేరే లెవెల్‌లో ప్లాన్ చేశార‌ట‌. మ‌రోవైపు రెండు సినిమాలు మేకింగ్, విజువల్స్, టెక్నికల్గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక రానున్న రోజుల్లో ఎక్కడ చూసినా కల్కి వర్సెస్ పుష్ప ప్రమోషన్స్ జోరుగా సాగుతాయని తెలుస్తుంది.