గులాబీ ‘అభ్యర్ధులు’ రెడీ..ఆ సిట్టింగులకే నో ఛాన్స్.!

మరో మూడు రోజుల్లో బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధుల లిస్ట్ రానుంది. ఈ నెల 21న సి‌ఎం కే‌సి‌ఆర్..తమ పార్టీ అభ్యర్ధుల మొదట లిస్ట్ విడుదల చేయనున్నారు. దాదాపు 87 మందితో మొదట లిస్ట్ విడుదల చేస్తారని తెలిసింది. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కే‌సి‌ఆర్ సీట్లు ఇవ్వడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 10 లోపే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది.

ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్‌కు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 కాంగ్రెస్, 7 ఎం‌ఐ‌ఎం, 3 బి‌జే‌పి సభ్యులు ఉన్నారు. ఇక ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధులని దాదాపు ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఓవరాల్ గా ఓ 87 మందితో మొదట లిస్ట్ విడుదల చేస్తారట. ఇక మిగిలిన అభ్యర్ధులని పరిస్తితులని బట్టి ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. అయితే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు విషయంలో డౌట్ ఉంది. కాకపోతే ఎక్కువమంది సిట్టింగులని పక్కన పెట్టడానికి కే‌సి‌ఆర్ రెడీగా లేరు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒకరు, ఉమ్మడి ఆదిలాబాద్ లో ముగ్గురు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకరు లేదా ఇద్దరు ఎమ్మెల్యేలని మార్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మహబూబ్‌నగర్ లో ఒకరు లేదా ఇద్దరిని మార్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అటు ఖమ్మంలో ఒకరిద్దరిని మారుస్తారని తెలిసింది. నిజామాబాద్, కరీంనగర్ సిట్టింగ్ స్థానాల్లో దాదాపు ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు అని తెలుస్తోంది.

ఇక సి‌ఎం కే‌సి‌ఆర్ దాదాపు గజ్వేల్ బరిలో పోటీ చేయడం ఖాయమని తేలింది. ఈ మధ్య ఆయన కామారెడ్డిలో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది..కానీ కే‌సి‌ఆర్ మాత్రం గజ్వేల్ లోనే పోటీ చేస్తారట.