సోహెల్ మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా రివ్యూ.. హిట్ కొట్టేనా..?

యాక్టర్ సోహెల్ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న నటుడు. ప్రస్తుతం హీరోగా చిన్న‌ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవల ఓ కొత్త ఎక్స్పరిమెంట్ మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాతో ప్రేక్షకులకు కనిపించాడు. దీనిని కొర్ర‌ డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించాడు. రూప కోడువయుర్‌ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఈరోజు (ఆగస్టు 18) శుక్రవారం థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా చూసిన కొంత మంది ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ఎలా వివరించారు.

కథ :
ఈ కథలో హీరో అమ్మ, నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో ఒంటరిగా పెరుగుతాడు. ప్రేమిస్తున్నానంటూ హీరోయిన్ అతని వెంటపడుతుంది. హీరో ప్రెగ్నెన్సీ వల్లే అమ్మ చనిపోయింది పిల్లలు వద్దని ఒప్పుకుంటేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని హీరోయిన్ తో అంటాడు. దానికి ఆమె ఓకే చెప్పడంతో ఇద్దరు పెళ్లి చేసుకుని ఒకటవుతారు. ఇక పెళ్లయిన తర్వాత హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ రావడంతో మొదట తిట్టి ఆ తర్వాత ఏం చేయాలో తెలియక హీరో ఆ ప్రెగ్నెన్సీ ని తీసుకుంటాడు. హీరో ప్రెగ్నెంట్ గా మారిన తర్వాత ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడు..? ఎలా ఆ సమస్యల నుంచి బయటపడతాడు..? అనే విషయం కథలో వివరించబడింది.

ప్ల‌స్‌లు – మైనెస్‌లు
మొదటి అరగంట హీరో మరియు హీరోయిన్ క్యారెక్టర్లు పరిచయం కోసం సాగదీసినట్లుగా ఉంటుంది. అది సినిమాకు మైనస్ అయ్యింది. ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇక చివరి 48 నిమిషాలు మాత్రం అమ్మ గొప్పతనం ఎమోషనల్ సీన్స్, ప్రెగ్నెన్సీ మహిళల కష్టాలు అన్నిటిని కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు. ఈ సీన్స్ సినిమాకి హైలెట్ అయ్యాయి. దర్శకుడు మొత్తానికి ఈ సినిమాతో చాలామంది ప్రేక్షకులను మెప్పించినట్లుగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా ఆడవారికి బాగా కనెక్ట్ అయింది.