ఆ స్టార్ హీరోతో రొమాన్స్ కు సిద్ధమైన రష్మిక మందన.. జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిందిగా..?!

టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. ఇటీవల యానిమల్ సినిమాతో మరోసారి బ్లాక్ బ‌స్టర్ తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతుంది. ఈ సినిమాతో పాటు రెండు మూడు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్న క్ర‌ష్మిక‌ లేడీ ఓరియంటెడ్ సినిమాలోని నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.

Rashmika Mandanna Sports Sindoor As She Returns As Srivalli in Allu Arjun's  Pushpa 2; FIRST Look Out - News18

ఇక తాజాగా ఈమె మరో జాక్ పాట్ ఆఫ‌ర్ కొట్టిందంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో నటించే అవకాశాన్ని ఈ అమ్మడు అందుకుందట. మురుగదాస్ డైరెక్షన్‌లో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సికిందర్ సినిమాలో రష్మికను సెలెక్ట్ చేసినట్లు మేకర్స్ గురువారం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మా.. సికిందర్ లో సల్మాన్ ఖాన్ జోడిగా నటించేందుకు రష్మికకు ఆహ్వానం పలుకుతున్నాం అంటూ అనౌన్స్ చేశారు మేకర్స్.

CONFIRMED! After Animal, Rashmika Mandanna Joins Salman Khan's Sikandar

ఈ జంట ఆన్ స్క్రీన్ మ్యాజిక్ త్వరగా చూడాలని కోరుకుంటున్నాం.. వచ్చే ఈద్ పండుగకు సల్మాన్, రష్మిక తెరపై ప్రత్యక్షమవుతారంటూ అనౌన్స్ చేశారు. దీనిపై తన ఇన్‌స్టాగ్రామ్ లో రష్మిక స్పందిస్తూ నా నెక్స్ట్ సినిమా అప్డేట్ చెప్పమని అభిమానులు అడుగుతున్నారు. వారి కోసం అద్భుతమైన అప్డేట్ ఇస్తున్నా. సల్మాన్ సార్ కి జోడిగా సికిందర్ లో నటించనున్న‌ అంటూ రిప్లై ఇచ్చింది. నాకు వచ్చిన ఈ అవకాశాన్ని గౌరవంగా, గర్వంగా ఫీల్ అవుతున్నానంటూ ఆమె పేర్కొంది. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.