విజయ్ శాంతి చేయాల్సిన ఆ మూవీ.. అనుష్క ఖాతాలోకి..ఎలా వచ్చింది..?

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కోసం రాసుకున్న పాత్రను మరొక హీరోయిన్ చేస్తూ ఉండడం సర్వసాధారణమే . అయితే ఒక హీరోయిన్ ఒక కాన్సెప్ట్ నచ్చి ఆ కాన్సెప్ట్ తెరకెక్కించాలి అనుకొని.. ఆ కాన్సెప్ట్ లో వేరొక హీరోయిన్ నటిస్తే మాత్రం ఆ బాధ నిజంగా వర్ణాతీతం. అలాంటి సిచువేషన్ ఫేస్ చేసింది విజయశాంతి . ఈమె పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అంద చందాలతో ఏలేసింది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఓ రేంజ్ లో ఇండస్ట్రీని ఊపేసింది .

ప్రజెంట్ సీనియర్ పాత్రలు పోషిస్తుంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టాక పూర్తిస్థాయిలో సినిమాలకు దూరమైన విజయశాంతి .. ఆ తర్వాత మళ్లీ సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారానే రియంట్రి ఇచ్చింది . ఇప్పుడు కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతుంది . అయితే విజయశాంతి చేయాలి అనుకున్న మూవీ అనుష్క ఖాతాలో పడింది అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ సినిమా మరేదో కాదు రుద్రమదేవి .

అనుష్క కెరియర్లో చాలా లేడీ ఓరియంటెడ్ ఫీలింలు చేసింది . వాటిల్లో ఒకటే ఈ రుద్రమదేవి. నిజానికి విజయశాంతి రాణి రుద్రమదేవి పాత్రలో నటించాలి అనుకున్నారట . ఆ కాన్సెప్ట్ ని కూడా ఆమె తెరకెక్కించాలి అని ఆశపడిందట . అయితే కొన్ని కారణాల చేత అది ఆలస్యమైందట . అప్పటికే తెలంగాణ వచ్చేయడంతో .. ఆ ప్రాజెక్టు మరింత ఆలస్యమైందట . ఆ తర్వాత విజయశాంతి ఆ ప్రాజెక్టు తెరకెక్కించాలి అని ప్లాన్ చేసిన అప్పటికే వేరే వాళ్ళు చేసేసారు అని చెప్పుకొచ్చింది. అలా విజయ్ చేయాల్సినటువంటి పాత్రను అనుష్క తన ఖాతాలో వేసుకుంది..!!