ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారులు ఇద్దరు టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్.. ఒకరు పాన్ ఇండియన్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?!

టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్, హీరో, హీరోయిన్ల ఫొటోస్ ఎప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు తమ అభిమాన హీరో, హీరోయిన్లను చూసి ఎందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు. వారి ఫేవరెట్ సెలబ్రిటీ చైల్డ్ హుడ్ ఫోటో కానీ, లేటెస్ట్ ఫోటో గానీ సోషల్ మీడియాలో వచ్చింది అంటే చాలు దాన్ని తెగ ట్రెండ్ చేసేస్తూ ఉంటారు. అలా తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు ప్రస్తుతం నెటింట బాగా వైరల్ అవుతున్నారు. వీరిద్దరూ టాలీవుడ్ లో పాపులర్ సెలబ్రిటీస్. టాలీవుడ్ టాప్ హీరో పిల్లలు. అందులో ఒకరు పాన్ ఇండియన్ స్టార్ హీరో.

Ram Charan to be styled by sister Sushmita | Telugu Movie News - Times of  India

ఇంతకీ వాళ్ళు ఎవరో గుర్తుపట్టారా.. బాళ్ళు ఎవ‌రో కాదు.. మెగాస్టార్ చిరంజీవి ముద్దుల పిల్లలు రామ్ చరణ్, సుస్మిత. సుస్మిత గతంలో ఆచార్య సినిమాకు చిరంజీవి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ఆమె చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తుంది. కాగా ఆచార్య సినిమా షూటింగ్ టైంలో సుస్మిత తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోను షేర్ చేస్తూ గుర్తుపట్టండి అంటూ ఈ పజిల్ వ‌దిలింది. కాగా ఇప్పుడు మ‌రోసారి ఈ పిక్ వైర‌ల్‌గా మారింది. ఇక సుస్మిత ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ బిజీగా సెలబ్రిటీ రేంజ్ లో పాపులార్టీ దక్కించుకుంది. తండ్రి, తమ్ముడు నటిస్తున్న సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతుంది.

ఎవరిని తిట్టాలో తెలియక అక్క మీదే అరుస్తాను.. రామ్ చరణ్ కామెంట్స్

ఇక రాంచరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ హీరోగా మారిన చరణ్.. సౌత్ తో పాటు నార్త్ లోను భారీ పాపులారిటీతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్‌ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్.. బుచ్చిబాబుసనా తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాట్టే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు చెర్రీ. ఇక ప్రస్తుతం చరణ్ నటిస్తున్న గేమ్ చేంజ‌ర్‌ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.