కళ్యాణ్ రామ్ మూవీ సెట్స్ లో భారీ ప్రమాదం.. ఏకంగా ఎన్ని కోట్ల నష్టం జరిగిందంటే..?!

నందమూరి నటవారసుడిగా మూడో తరంలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో కళ్యాణ్‌రామ్ ఒకరు. నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోలుగా ఎంతోమంది అడుగుపెట్టిన.. కేవలం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే స్టార్ హీరోలుగా ఎదగలిగారు. కాగా కళ్యాణ్ రామ్ చివరిగా నటించిన మూవీ డెవిల్ మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన 21వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా సెట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కొద్దిరోజుల క్రితమే ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుందుట. అయితే ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

NKR 21 Pre-Look: Kalyan Ram Appears Orthodox - Kalyan Ram

ఈ సినిమా కథలో భాగంగా ఓ సిబిఐ ఆఫీసులో కొంత షూట్ చేయాల్సి ఉండగా.. ఈ నేపథ్యంలో సిబిఐ ఆఫీస్ సెట్ నిర్మించినట్లు సమాచారం. సుమారు పది రోజుల పాటు ఈ సిబిఐ ఆఫీస్ సెట్ లో షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికే 9 రోజులు షూటింగ్ పూర్తయిన తర్వాత.. ఒక్క రాత్రి సమయంలోనే అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సెట్ మొత్తం అగ్నికి ఆహుతి అవడంతో ఇంకా షూటింగ్ కాస్త మిగిలే ఉండడంతో మేకర్స్ కు రూ.4 కోట్ల వరకు నష్టం వ‌చ్చింద‌ని తెలుస్తోంది. తొమ్మిదవ రోజు సాయంత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సినిమా యూనిట్ అంతా వెళ్ళిపోగా.. ఆ రోజు రాత్రి 8 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందట.

ఈ విషయం రాత్రి 1:30 సమయంలో యూనిట్‌కు తెలియడంతో వారు అక్కడికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లే లోపే సెట్ దాదాపు కాలిపోయిందని సమాచారం. ఇక ఈ సినిమా గత ఏడది అక్టోబర్లో సెట్స్ పైకి వచ్చింది. ఈ మూవీలో కళ్యాణ్‌రామ్ సర‌స‌న హీరోయిన్గా సాయి మంజ్రేక‌ర్‌ నటిస్తుండగా విజయశాంతి కీలకపాత్రలో కనిపించనుంది. భారీ బడ్జెట్, హైటెక్నికల్ వాల్యూస్‌తో ప్రదీప్ చిలకలూరి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని.. ఆయన కెరియర్ లోనే సినిమా మైల్ స్టోన్ గా నిలవ‌నుంద‌ని టాక్‌.