నయనతార ఆఫర్ కొట్టేసిన జాక్వాలిన్ ఫెర్నాండెజ్.. పేపర్ బాయ్ డైరెక్టర్ మాస్టర్ స్కెచ్..?!

సంతోష్ శోభ‌న్‌ హీరోగా నటించిన పేపర్ బాయ్ సినిమాతో సున్నితమైన ఎమోషనల్ కంటెంట్ ఎంతో అద్భుతంగా తర్కెక్కించి మంచి సక్సెస్ సాధించాడు డైరెక్టర్ జయశంకర్. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న జయశంకర్ అరి.. అంటూ అరిషడ్వర్గాల పై సినిమాను తీసి అందరిలోనూ ఆసక్తి కల్పించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన పలువురు సెలబ్రిటీలు జయశంకర్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జయశంకర్ నెక్స్ట్ సినిమాపై కొత్త రూమర్లు మొదలయ్యాయి.

Team 'Vikrant Rona' wraps up the song featuring Jacqueline Fernandez |  Kannada Movie News - Times of India

ఇప్పటికి ఆయన ఓ లేడీ ఓరియంటల్ సబ్జెక్టులో సిద్ధం చేసుకున్న నేపథ్యంలో.. ఈ సినిమా కథను నయనతారకు వినిపించినట్లు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్టుపై మరోసారి కొత్త వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్టులోకి నయనతారను పక్కకు నెట్టి.. సౌత్ నార్త్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీలంకన్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఎంట్రీ ఇచ్చిందంటూ తెలుస్తుంది. ఈ భారీ ప్రాజెక్టును పాన్ ఇండియా లెవెల్ లో తెర‌కెక్కించనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఆఫీషియ‌ల్ అనైన్స్‌మెంట్‌ రాలేదు. ప్రస్తుతం తీసిన అరి మూవీ పనులలో బిజీగా ఉన్నాడు జ‌య శంక‌ర్‌. ఎలక్షన్స్ తర్వాత ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.

పేపర్ బాయ్' దర్శకుడిపై ఆసక్తి చూపుతున్న నిర్మాతలు | Paper Boy director  Jayashankar get good offers - Telugu Filmibeat

జోన్‌లో ఈ సినిమా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక వైవిధ్యమైన కథ అంశాంతో ఈ మూవీ తెర‌కెక్కిన్న‌ట్లు తెలుస్తుంది. దైవత్వం అనే పాయింట్ తీసుకొని కొత్త ఫాంటసీ డ్రామాగా సినిమాను తెరకెక్కించాడట జయశంకర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సంపాదించింది. పోస్టర్లో ఇక్కడ అన్ని కోరికలు తీర్చబడును అనే క్యాప్షన్ తో రిలీజై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొల్పింది. ఇక ఈ సినిమా మొత్తం ఆరు పాత్రల చుట్టూనే తిరుగుతుందని సమాచారం. ఈ మూవీలో అనసూయ, సాయికుమార్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలకపాత్రలో నటించారు.