కార్తీకదీపం.. దీపక్క రోల్ మిస్ చేసుకున్న నటి ఎవరో తెలుసా.. జాక్ పాట్ ఛాన్స్ మిస్ చేసుకుందే..?!

బుల్లితెరను ఓ ఊపు ఊపిన సీరియల్ కార్తీకదీపం. మాటీవీలో భారీ పాపులారిటి ద‌క్కించుకున్న ఈ సీరియల్ విశేష ప్రేక్షక ఆధారం పొందడంతో పాటు.. భారీ టిఆర్పి తో బ్లాస్టింగ్ రికార్డును సృష్టించింది. బుల్లితెర చరిత్రలోనే నెంబర్ వన్ సీరియల్ గా నిలిచింది. ఇక ఈ సీరియల్ లో వంటలక్కగా, దీప అక్కగా ప్రేక్షకులను అలరించిన ప్రేమీ విశ్వనాథ్ ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయ్యింది. చూడగానే తెలుగు అమ్మాయి అనేంతలా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

Premi viswanath - Karthikadeepam | Facebook

కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ అప్ప‌టికే మలయాళం లో ప‌లు సీరియల్స్‌లో నటించింది. మలయాళంలో నటించిన సీరియల్స్ లో నల్లటి అమ్మాయిల కనిపించి అందరి మనసును దోచుకుంది. రెండు అవార్డులు దక్కించుకుంది. తెలుగులో మాత్రం ఇది ఫ‌స్ట్ సీరియల్ అయినప్పటికీ ఈ సీరియల్ తో మంచి పాపులారిటి దక్కించుకుని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఇక తాజాగా ఈ సీరియల్‌కు సీక్వెల్ గా కార్తీకదీపం నవవసంతం మొదలైన సంగతి తెలిసిందే.

Chandana Shetty Wiki, Age, Family, Biography, etc | wikibion

అయితే ఈ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్న కార్తీకదీపం వంటలక్క పాత్రకు మొదట వరూదినీ పరిణయం సీరియల్ లో నటించిన గుర్తింపు తెచ్చుకున్న చందన శెట్టి ని సెలెక్ట్ చేశారట. అయితే ఆమె ఏవో కారణాలతో సీరియల్ స్టోరీ నచ్చినప్పటికీ కథను వదులుకుంది. దీంతో ప్రేమీ విశ్వనాధ్ దగ్గరకు అవకాశం వెళ్లడంతో.. ఆమె గ్రీన్ సిగ్నెల్ ఇచ్చి ఈ సీరియ‌ల్‌లో వంట‌ల‌క్క‌గా నటించి భారీ పాపులారిటీ దక్కించుకుంది. అలాగే ఈమెకు ఈ సీరియల్ ద్వారా ఎన్నో అవార్డులు కూడా దక్కాయి.