” తప్పంతా నాదే”.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మెగా మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్..!

కళ్యాణ్ దేవ్ ..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. మెగా మాజీ అల్లుడుగా కావాల్సిన గుర్తింపు సంపాదించుకున్నాడు. మెగా ఫ్యామిలీతో ఉన్నప్పుడు శ్రీ కళ్యాణ్ దేవ్ కి మెగా ఫాన్స్ సపోర్ట్ చేశారే ..కానీ ఎప్పుడైతే మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేశారో.. శ్రీజ కి దూరంగా ఉండటం స్టార్ట్ చేశారో.. అప్పటినుంచి కళ్యాణ్ దేవ్ ని పట్టించుకోవడమే మానేశారు మెగా అభిమానులు .

మెగా అభిమానులు కళ్యాణ్ దేవ్ ని పట్టించుకోవడం మానేసినప్పటినుంచి మెగా హేటర్స్ – కళ్యాణ్ దేవ్ పెట్టే పోస్టుల పై ఎక్కువగా స్పందించడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే కళ్యాణ్ దేవ్ తాజాగా ఓ రీల్ షేర్ చేసుకున్నారు . దీంతో ఈ విషయాన్ని ఆయన వివాహం విడాకులకు లింక్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. కాగా ఈ వీడియోలో రౌండ్ వీల్ స్క్వేర్ వీల్ ఉండగా చతురస్రాకారంలో ఉన్న చక్రానిది తప్పులేదు అని ..

దానికి అనుగుణంగా ఉండే రోడ్ కావాలి అని అర్థం వచ్చేలా ఉంది . ఈ రీల్ చేసిన కళ్యాణ్ దేవ్ కి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి . ఆయనకు నిజంగానే సరైన ప్లేస్ దొరకలేదని అంటూ నెటిజెన్లు కామెంట్ పెడుతున్నారు . మరికొందరు ఇందులో తప్పులేదు తప్పంతా తనదే ..రాంగ్ రోడ్ పై పరిగెత్తాడు అంటూ విమర్శిస్తూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు. సోషల్ మీడియాలో కళ్యాణ్రామ్ షేర్ చేసిన రీల్ బాగా ట్రెండ్ అవుతుంది. వైరల్ గా కూడా మారింది . మరోసారి సోషల్ మీడియాలో కళ్యాణ్రామ్ పేరు మారుమ్రోగిపోతుంది..!