పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ శ్రద్దాదాస్..ఆ లక్కీ మగాడు ఎవరంటే..!

సినీ ఇండస్ట్రీలో పెళ్లికళ వచ్చేస్తుంది . టాప్ మోస్ట్ హీరోయిన్స్ హీరోలు అందరూ పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు . ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు . తాజాగా మరొక హీరోయిన్ కూడా పెళ్లి బాటలో నడవబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలే అంటూ తెలుస్తుంది . ఆమె మరి ఎవరో కాదు హీరోయిన్ శ్రద్దాదాస్ . టాప్ హీరోయిన్ అని చెప్పలేం కానీ ఆమె అందాలు ఎక్స్పోజ్ చేస్తే మాత్రం కుర్రాళ్లను ఓ రేంజ్ లో ఆకట్టుకునేస్తుంది . సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధాదాస్ ఆ తర్వాత ప్రభాస్ తో డార్లింగ్ ..బన్నీతో ఆర్య 2.. గోపీచంద్ తో మొగుడు లాంటి సినిమాల్లో నటించి సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.

మరికొన్ని సినిమాలో నటించిన పెద్దగా క్రేజ్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన అవకాశాలు చేసుకుంటూ వచ్చింది . అయితే శ్రద్ధాదాస్ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటుంది . హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తుంది . ప్రజెంట్ పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న శ్రద్ధదాస్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది . ఆమె తన పెళ్లిపై రియాక్ట్ అవ్వడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

“అవును నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను ప్రేమలో ఉన్నాను ఆయన తెలుగు ఇండస్ట్రీకి చెందిన వాడే ఒక నటుడు ఆ విషయం నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. కానీ అతను ఎవరు అనేది నేను బయటకు చెప్పాలనుకోవడం లేదు.. త్వరలోనే పెళ్లి చేసుకుంటా ఓకేనా.. నాకు చాలామంది ప్రపోజ్ చేశారు ..లవ్ లెటర్స్ కూడా ఇచ్చారు కానీ, నాకు నచ్చలేదు ..అతనిని చూడగానే నేను ఫిదా అయిపోయా “. దీంతో సోషల్ మీడియాలో శ్రద్ధాదాస్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. ప్రేమిస్తున్నాను అని చెప్పింది కానీ ఎవరిని ప్రేమిస్తున్నానో మాత్రం చెప్పలేదు అంటూ శ్రద్ధపై మండిపడుతున్నారు మరికొందరు . అతను ఎవరై ఉంటారా అంటూ తెగ సెర్చింగ్ స్టార్ట్ చేశారు..!